కలకలం: గుజరాత్‌లో కాంగ్రెస్ నేత, అతని భార్య ఆత్మహత్య..
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు హరేష్ మొరాదియా, అతని భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజ్ కోట్ లోని కొఠారి రోడ్డులో ఉన్న మహేశ్వరి సొసైటీ నివాసంలో విషం తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంట్లో సూసైడ్ నోట్ ఏది దొరకలేదు. హరేష్ కాంగ్రెస్ పార్టీలోని రైతు విభాగం కీలకంగా వ్యవహరిస్తున్నారు.. అలాగే ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ గాను ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించి ఇంతవరకు కారణం తెలియరాలేదు. భక్తినగర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

డిసెంబర్ 14న గుజరాత్ లో రెండో దశ ఎన్నికల జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications