Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తండ్రి కాదు కసాయి: కన్న కొడుకులనే కడతేర్చాడు...అసలేం జరిగింది..?

గుజరాత్ : గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసే నేరస్తుడిగా మారాడు. అది కూడా ఎవరిపైనో ఆయన దాడి చేయలేదు. తన సొంత కుటుంబం అది కూడా తన కన్న కొడుకుల గొంతు కోసి హత్య చేశాడు. ముగ్గురు 8 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వయసున్న చిన్నారులు కావడం విశేషం. ఆదివారం రోజున తన భార్యతో గొడవ పడిన పోలీస్... ఆ కోపం ఎలాంటి పాపం తెలియని ముగ్గురు చిన్నారులపై చూపాడు. వారిని ఈ లోకంలో లేకుండా చేశాడు. ముగ్గురు పిల్లలను చంపి తనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన సహచరులు పోలీస్ క్వార్టర్స్‌లోని ఇంటికి చేరుకోగానే షాక్‌కు గురయ్యారు.

ఆదివారం రోజున తన భార్యతో గొడవ పడ్డ సుఖ్‌దేవ్ అనే ఈ పోలీసు తన భార్యను మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆ తర్వాత ముగ్గురు కుమారులు కుశల్ (8), ఉద్దవ్ (5) మరియు మన్మీత్ (3)ల గొంతు కోసి హత్య చేశాడు. ఇక ముగ్గురిని హత్య చేశాక పోలీస్ స్టేషన్‌కు స్వయంగా సుఖ్‌దేవ్ ఫోన్ చేశాడు. ఇక ఇంటికి చేరుకున్న పోలీసులు ఓ గదిలో ఉన్న సుఖ్‌దేవ్‌ భార్యను బయటకు తీసుకొచ్చారు. సుఖ్‌దేవ్ మాత్రం కత్తిపట్టుకుని ఓ మూలన కూర్చుని ఉండటాన్ని పోలీసులు గమనించారు.

Gujarat cop kills three of his sons after a fight with wife

ఇక రక్తపు మడుగులో ముగ్గరు చిన్నారుల మృతదేహాలు పడిఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు తోటి పోలీసులు. శుక్రవారం రోజున తన భార్యతో పెద్ద గొడవ జరిగిందని పోలీసులకు తెలిపారు. ఆ రోజున తన పెద్ద కుమారుడి పుట్టిన రోజుని చెప్పాడు. అంతకు ముందే అంటే శుక్రవారంకు ముందే ఓ సారి గొడవ పడినట్లు వెల్లడించాడు. అసలు గొడవకు దారితీసిన కారణాలేంటనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సుఖ్‌దేవ్ సియాల్‌ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+