గుజరాత్ ఎన్నికలు: ముగిసిన ప్రచారం, ఢిల్లీకి మోడీ, రాహుల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు.

జగన్నాథ ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం అహ్మదాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయాలకు వెళ్లడంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఏ సమయంలోనైనా తనకు ఆలయాలకు వెళ్లే హక్కు ఉందని, తాను కేదారినాథ్ కూడా వెళ్లానని, తాను ఆలయాలకు వెళ్లేది గుజరాత్ ప్రజల భవిష్యత్ బాగుండాలని, అభివృద్ధి చెందాలని, ఆలయాలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications