వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ తీర్పు: ప్రధాని మోదీకి జీవన్మరణ సమస్య.. పట్టుకోసం యువనేత రాహుల్

డిసెంబర్ 18వ తేదీలోగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat upcoming assembly elections : గుజరాత్ తీర్పు: ప్రధాని మోదీకి జీవన్మరణ సమస్య

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: చుట్టూ చీకటి, దారంతా ముళ్లు, అయినా ఆశలన్నీ ఆయన పైనే.. భారమంతా అధినేత భుజాలపైనే. ఆయనే ప్రధాని నరేంద్రమోదీ. తాజాగా గుజరాత్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది. కానీ ప్రధాని మోదీ ఇమేజ్‌ మసకబారుతుండటమే కమలనాథులకు కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఆకర్షణ గల నేతగా గుజరాతీలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు.

గత మార్చిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశలో గోరఖ్ పూర్, వారణాసిల్లో రోడ్ షోల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. తదనుగుణంగా ఆ రెండు రీజియన్లలో గంపగుత్తగా బీజేపీకి ఓట్లు పడ్డాయి. గుజరాత్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీ అదే వ్యూహం అనుసరిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 ఇలా ఆర్థిక వ్యవస్థ కుదేలు.. పెరుగుతున్న నిరుద్యోగిత

ఇలా ఆర్థిక వ్యవస్థ కుదేలు.. పెరుగుతున్న నిరుద్యోగిత

అయితే గత మూడున్నరేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీపై తొలిసారిగా స్వయంగా సొంత పార్టీ బీజేపీలోనే అసమ్మతి స్వరాలు వినిపించడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఉద్యోగాలు 12 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనం కావడం ఎంతటి ప్రజాదరణ కలిగిన నేతకైనా ఆందోళన కలిగించే పరిణామాలే. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వృద్థి దిగజారడం మోదీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలకు అవకాశం అంది వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీలోనే యశ్వంత్‌ సిన్హా వంటి సీనియర్లు మోదీని లక్ష్యంగా చేసుకోవడం కమలనాథుల్లో కలవరం కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంపై ప్రధాని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా దిద్దుబాటుకు దిగడం నష్ట నివారణ చర్యల్లో భాగమని బెంగుళూర్‌కు చెందిన జైన్‌ వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌, రాజకీయ విశ్లేషకులు సందీప్‌ శాస్త్రి వ్యాఖ్యానించారు.

 కలకలం రేపిన యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు

కలకలం రేపిన యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికలకు 18 నెలల సమయం ఉన్నా ఇప్పుడు ఆర్థిక అంశాలపైన విమర్శలూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను మోదీ నడిపిస్తున్న తీరుపై వాజ్‌పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్‌ సిన్హా నిప్పులు చెరగడం కలకలం రేపింది. పార్టీలో ఇదే అభిప్రాయంతో ఎంతో మంది ఉన్నారని, కానీ వారు భయంతో తనలా మాట్లాడలేకపోతున్నారని సిన్హా కుండబద్దలు కొట్టారు. సిన్హా వ్యాఖ్యలను పార్టీ నేత శత్రుఘ్న సిన్హా సమర్థించారు. ఆర్థిక వ్యవస్థను సిన్హా వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక వాజ్‌పేయి కేబినెట్‌లోనే మంత్రిగా పనిచేసిన అరుణ్‌ శౌరీ సైతం నోట్ల రద్దును ఆత్మహత్యాసదృశమని అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభం దిశగా పయనిస్తున్నదని పార్టీ ఎంపీ ప్రొఫెసర్‌ సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు.

 మోదీ పాలనపై కాంగ్రెస్ ఇలా విమర్శలు

మోదీ పాలనపై కాంగ్రెస్ ఇలా విమర్శలు

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతల విమర్శలు సరే సరి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌ శర్మ వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని యూపీఏ హయాంలో ఇంతకంటే దారుణంగా వృద్ధి రేటు పడిపోయిందని చెప్పుకొచ్చారు.

 రోడ్ షోల ద్వారా దగ్గరయ్యేందుకు మోదీ యత్నం

రోడ్ షోల ద్వారా దగ్గరయ్యేందుకు మోదీ యత్నం

ఇక ఒక ప్రధానిగా ఇంటింటికి ప్రచారం చేయడానికి భద్రతా కారణాల రీత్యా అసాధ్యం కూడా. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రోడ్ షోల నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలకు అతి దగ్గర నుంచి ప్రచారం చేసినట్లవుతుందని గుజరాత్ బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. గత ఆదివారం ఆయన పుట్టినూరు వాద్‌నగర్ లోనూ చివరిసారిగా రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీ తొలుత జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేపట్టారు. గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ నాలుగు రోడ్ షోలు నిర్వహించారంటే బీజేపీ ప్రచారం తీరు ఎలా ఉన్నదో అవగతమవుతూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

 నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తేనే ఎన్డీయేకు విజయావకాశాలు

నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తేనే ఎన్డీయేకు విజయావకాశాలు

ఆర్థిక అంశాలు రాజకీయ వేడి రగులుస్తున్న క్రమంలో మోదీ విజయ పరంపర కొనసాగడంపై నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ బలాబలాలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. బలమైన విపక్షం లేకపోవడం మోదీకి కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్షణం ముందుకొచ్చిన ఆర్థిక సవాళ్లను మోదీ పరిష్కరించగలిగితే పెద్ద ప్రమాదం ఉండబోదని రచయిత, రాజకీయ విశ్లేషకులు అజయ్‌ బోస్‌ అన్నారు.అయితే మోదీ ఇమేజ్‌పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నా నిరుద్యోగ సమస్యను 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా దీటుగా ఎదుర్కోని పక్షంలో ఎన్‌డీఏకు విజయావకాశాలు అంత సులభం కాదని పేర్కొంటున్నారు.

 2019లో మార్కెటింగ్ మంత్రాలు కుదరవని యశ్వంత్ సిన్హా స్పష్టీకరణ

2019లో మార్కెటింగ్ మంత్రాలు కుదరవని యశ్వంత్ సిన్హా స్పష్టీకరణ

నోట్ల రద్దు తర్వాత యూపీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మోదీ మార్కెటింగ్‌ వ్యూహాల ఫలితమని యశ్వంత్‌ సిన్హా పేర్కొనడాన్ని చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం మార్కెటింగ్‌ మంత్రాలే పనిచేయవని, క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఎంతమేర మేలు జరిగిందనే ప్రాతిపదికన ఎన్నికల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగులు, రైతుల సమస్యలు మరింత జటిలం కాకుండా చేయడం మోదీ ముందున్న సవాల్‌గా పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ మోదీకి దీటైన ప్రత్యామ్నాయం లేదని, అయితే ఎంతటి ప్రతిష్ట కలిగిన నేతకైనా ప్రజాగ్రహం వ్యక్తమైతే మాత్రం దానిముందు ఇమేజ్‌ డ్యామేజ్‌ అవడం అసాధ్యమేమీ కాదని అజయ్‌ బోస్‌ అన్నారు.

 ప్రజా విశ్వాసం కోసం ఇలా గౌరవ్ యాత్రలు

ప్రజా విశ్వాసం కోసం ఇలా గౌరవ్ యాత్రలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి ఎంతో ముఖ్యం. 2014లో ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్ రాష్ట్రం పాటిదార్లు, దళితుల ఆందోళనలకు వేదికైంది. ఈ ఆందోళనల ఫలితంగా గతేడాది ఆగస్టులో సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తప్పించి విజయ్ రూపానీని నియమించాల్సిన గడ్డు పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో వివిధ ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో తిరిగి అందరి విశ్వాసం పొందేదుకు అధికార బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘గుజరాత్ గౌరవ్ యాత్ర' చేపట్టింది. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో 149 నియోజకవర్గాల మీదుగా సాగే ఈ గౌరవ్ యాత్రలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రగతి మోడల్‌ను ప్రచారం చేస్తూ కమలనాథులు ముందుకు సాగుతున్నారు.

జీఎస్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శల పర్వం

జీఎస్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శల పర్వం

మరోవైపు బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన పార్టీ తరఫున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రెండో దఫా మూడు రోజుల పాటు సెంట్రల్ గుజరాత్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండుసార్లు నవ్ సర్జన్ యాత్ర నిర్వహించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల సమస్యలు వింటామని హామీలు గుప్పించారు. ఖేడా జిల్లాలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘గుజరాత్ రాష్ట్రంలో వికాస్ (అభివ్రుద్ధి)కి ఏమైంది? అభివ్రుద్ధి పేరుతో అబద్దాలు చెప్పి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు‘ అని అన్నారు. బీజేపీ అభివ్రుద్ధి మోడల్‌నే కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాస్త్రంలో ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నది. మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో అవకతవకలు, నిరుద్యోగం, రైతుల సమస్యల పట్ల పట్టని తీరు, ఆర్థిక రంగం మందగమనం, క్రోనీ క్యాపిటలిజం తదితర అంశాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది.

 రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇలా ఆనందీబెన్ పటేల్

రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇలా ఆనందీబెన్ పటేల్

సౌరాష్ట్రలో ప్రత్యేకించి పటేళ్లకు నిలయమైన ప్రాంతాల్లో జై సర్దార్.. జై పటేల్ అనే నినాదంతో తొలుత పర్యటించిన రాహుల్ గాంధీ.. ప్రసిద్ధి చెందిన ద్వారకాదీశ్ ఆలయంతోపాటు పలు దేవాలయాలను సందర్శించారు. గత సోమవారం సంత్రాంపూర్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకపోతే 13 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాందీ.. వివిధ అంశాలపై ఇప్పటికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరి పక్షాలకు దొరికి పోతున్నారు. తాజాగా బీజేపీ మాత్రు సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదని ప్రశ్నించబోయి.. ష్కర్టులు వేసుకుంటున్న మహిళలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించడం బీజేపీ నేతలకు అంది వచ్చిన అవకాశంగా మారింది. భారత దేశంలో మహిళలు ష్కర్టులు వేసుకోవడం సంప్రదాయమా? అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ నిలదీశారు. ఆరెస్సెస్‌లో మహిళలను ఎలా గౌరవిస్తారో తెలుసుకునేందుకు తమ శాఖకు హాజరు కావాలని బీజేపీ నేత ఒకరు.. ప్రియాంకాగాంధీని ఆహ్వానం పంపారు.

 కాపలాదారు ఏం చేస్తున్నారని ప్రధాని మోదీని నిలదీసిన రాహుల్

కాపలాదారు ఏం చేస్తున్నారని ప్రధాని మోదీని నిలదీసిన రాహుల్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్‌షా సారథ్యంలోని కంపెనీ మూడేళ్లలో 16 వేల రెట్లు పెరిగి రూ.80 కోట్లకు చేరుకోవడం అంత పెద్ద లావాదేవీ కాకపోయినా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా, ఉత్పాదక వ్యవహారాల్లేకుండా ఈ టర్నోవర్ సాధించడం వెనుక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ‘ది వైర్' అనే వెబ్ సైట్ వార్త ప్రచురించినందుకు జయ్ షా తరఫున కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఆ వార్తా సంస్థ యాజమాన్యంపై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనవసర అత్యుత్సాహం ప్రదర్శించి.. ముందుగానే తన అశక్తతను బయటపెట్టుకున్నది. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం.. తన నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ న్యాయవాదిగా అదనపు సొలిసిటర్ జనరల్‌ను నియమించడంతోనే కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. ఇటీవల బీజేపీ పార్లమెంటరీ పార్టీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాను అవినీతికి పాల్పడబోనని, అవినీతికి పాల్పడనివ్వబోనని.. ఒక ‘వాచ్‌మన్'గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఆ కాపలాదారు ఏం చేస్తున్నారని ప్రధాని మోదీకి విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పేవారే లేరు.

English summary
New Delhi/Ahmedabad: The Bharatiya Janata Party (BJP) has tweaked its poll strategy for the upcoming assembly elections in Gujarat to allow its star campaigner Prime Minister Narendra Modi to do more roadshows. “The election campaign will revolve around Prime Minister Narendra Modi because he is the one who gets the votes for the party. Since the PM doesn’t have the time to get involved in door-to-door campaigns and there can also be security concerns, there is a view to hold roadshows so that people get to see and meet the PM. It is the closest PM can go to the public,” said a senior BJP leader from Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X