Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్ చేసినవాడి చెంతకే వెళ్తా, బిడ్డను కంటా: విక్టిమ్

ఓ అత్యాచార బాధితురాలు విచిత్రమైన కోరిక కోరింది. తనను రేప్ చేసినవాడి వద్దకే వెళ్తానని, రేప్ కారణంగా గర్భం దాల్చిన ఆమె బిడ్డకు జన్మనిస్తానని చెప్పింది.

అహ్మదాబాద్‌: తనపై అత్యాచారానికి పాల్పడి, గర్భం దాల్చడానికి కారణమైన నిందితుడితో కలిసి ఉండే విధంగా చూడాలని ఓ బాధితురాలు గుజరాత్‌ హైకోర్టును కోరింది. నిందితుడిని తాను ప్రేమిస్తున్నానని, బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నానని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అత్యాచార బాధితురాలు నిందితుడి కుటుంబంతో ఉండే విధంగా చూడాలని గుజరాత్ హైకోర్టు ఆనంద్‌ జిల్లా పోలీసులను ఆదేశించింది.

నిందితుడి నిందితుడి కుటుంబం ఎక్కడ నివసిస్తుందనే విషయాన్ని కోర్టు మహిసాగర్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని అడిగి తెలుసుకుంది. యువతి ప్రసవం సురక్షితంగా జరిగేలా చూడాలని కూడా మహిసాగర్‌ సామాజిక సంక్షేమ శాఖ అధికారికి సూచించింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను ఆదేశించింది.

Gujarat High Court Allows 'Rape Victim' To Live With Accused's Family

తన గర్భవిచ్ఛిత్తికి బాధితురాలు అనుమతి కోరగా దిగువ కోర్టు నిరాకరించింది. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. చట్ట ప్రకారం ఇరవై వారాల వయసు కంటే ఎక్కువ ఉండే గర్భాలను తొలగించడం కుదరదని దిగువ కోర్టు బాధితురాలికి సూచించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీబీ పార్దివాలా ముందు తన ఆవేదనను వెళ్లబోసుకుంది. నిందితుడితో కలిసి ఉండేందుకు ఇష్టమేనని, అలాగే బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని హైకోర్టు న్యాయమూర్తితో చెప్పింది. కోర్టు నిందితుడిని పిలిపించి, అతని అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. బాధితురాలు సంరక్షణతో పాటు పుట్టబోయే బిడ్డ సంరక్షణనను కూడా తాను తీసుకుంటానని నిందితుడు చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+