గోద్రా అల్లర్లపై గుజరాత్ జడ్జి షాకింగ్-అవి మీడియా, లౌకిక వాదుల సృష్టే-35 మందికి విముక్తి

2002లో గుజరాత్ లోని గోద్రాలో సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం తర్వాత చోటు చేసుకున్న అల్లర్లలో వేలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అల్లర్లకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా నిర్దోషులుగా విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుజరాత్ లోని స్ధానిక కోర్టు నాలుగు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూన్ 12న పంచమహల్ జిల్లాలోని హలోల్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి హర్ష్ బాలకృష్ణ త్రివేది మొత్తం 35 మంది నిందితులపై కలిపి విచారించిన నాలుగు కేసుల్లో తీర్పును వెలువరించారు. ఇరవై సంవత్సరాల క్రితం విచారణ ప్రారంభమైనప్పుడు 52 మంది నిందితులుగా ఉండగా.. ఈ మధ్య కాలంలో 17 మంది చనిపోయారు. మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో నిర్దోషులుగా విడుదలైన 35 మందిలో పలువురు డాక్టర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, వ్యాపారులు ఉన్నారు. వీరంతా నకిలీ అల్లర్ల వివాదాల్లో సుదీర్ఘ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

gujarat judge controversial comments on godhra riots-not planned as claimed by media, secularists

గోద్రా అల్లర్లు ఆకస్మిక అల్లర్లని, నకిలీ లౌకిక వాదులు చెబుతున్నట్లు ఈ అల్లర్లకు ఎలాంటి ముందస్తు ప్లాన్ చేయలేదని ఆయన న్యాయమూర్తి. ప్రాసిక్యూషన్ దీన్ని నిరూపించడంలో విఫలం కావడంతో కేసులు కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. నిందితులపై హత్య, అల్లర్లు, సజీవ దహనం, చట్టవిరుద్ధమైన సమావేశాలు, ఆయుధాల చట్టం, ఇతర నేరాలతోపాటు రూహుల్ అమీన్ పద్వా, హరున్ అబ్దుల్ సత్తార్ తసియా, యూసుఫ్ ఇబ్రహీం షేక్ అనే ముగ్గురు వ్యక్తులను చంపినందుకు అభియోగాలు మోపారు. వీరంతా వేర్వేరు చోట్ల హత్యకు గురయ్యారు.

ఈ కేసులపై ఇచ్చిన 36 పేజీల తీర్పులో న్యాయమూర్తి.. దేశంలో మతపరమైన అల్లర్లు చాలా కాలంగా కొనసాగుతున్నాయని, సాధారణంగా ఇది చిన్నవిషయం అన్నారు. అలాగే అసహనం, మతపరమైన వస్తువులను తారుమారు చేయడం, పండుగలలో ఇతరుల చొరబాట్లు, వివాదాస్పద ప్రార్థన సమయం, ప్రార్థనా స్థలాలపై వివాదం వంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. కానీ వీటిపై సూడో లౌకికవాదులు, బూటక మీడియా అల్లర్లంటూ కథలు అల్లిందంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+