రాహుల్‌పై అభిమానమేం లేదు: కానీ కాంగ్రెస్‌కే బట్టల వ్యాపారుల మద్దతు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

సూరత్: గుజరాత్‌లో సూరత్ పట్టణం వ్యాపారాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి బట్టలు, వజ్రాభరణాలకు పేరొందింది పెట్టింది పేరు. లెక్కలేనన్ని సిల్కు వస్త్రాల ప్యాకెట్లు, సింథటిక్, నైలాన్, ఖాదీ వస్త్రాలతో కూడిన ప్యాకెట్లకు పెట్టింది పేరు సూరత్. రంగురంగుల మెరుపులు, అద్ధకంతో కూడిన బట్టలు మగువలను ఆకర్షిస్తాయంటే అతిశయోక్తి కాదు. వందల మంది బట్టల వ్యాపారులకు నిలయమైన సూరత్ పట్టణం అతివలను ఆకర్షించే సువాసనలకు నిలయమైన సూరత్ పట్టణంలో వ్యాపారులంతా ప్రస్తుతం కినుక వహించారు.అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒకింత కోపంతో ఉన్నారు. దానికి గత జూలైలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలుచేసిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్‌లే కారణం.

భారీ స్థాయిలో శ్లాబ్‌తో కూడిన జీఎస్టీ విధించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏకపక్షంగా జీఎస్టీని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ సూరత్‌లో ఆందోళనలకు దిగిన వ్యాపారులపై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిర్ధాక్షిణ్యంగా అణచివేసిందన్న విమర్శలు ఉన్నాయి.
22 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అండగా నిలిచిన వ్యాపార వర్గాలు ఈ దఫా 'కమలం' పార్టీకి తిలోదకాలిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్టల ఉత్పత్తి, దుస్తుల వ్యాపారంతో మమేకమైన ఈ సూరత్ పట్టణం పలు అనుబంధ రంగాల ద్వారా వివిధ వర్గాలకు కల్పిస్తున్న ఉపాధి కరువైంది. ఈశాన్య సూరత్‌లోని వరచ్ఛా, ఉత్తర సూరత్ పట్టణంలోని కటార్గాంకు చెందిన రసీఖ్ భాయి, ఎంబ్రాయిడరీ వర్క్ నైపుణ్యం గల వారు, లేస్‌ల తయారీలో పేరొందిన వారెవ్వరికీ జీఎస్టీలో ప్రాథమిక పత్రాలు పూరించడం ఎలాగో తెలియదంటే అతిశయోక్తి కాదు.

 సంక్లిష్టమైన జీఎస్టీతో మోయలేని భారం

సంక్లిష్టమైన జీఎస్టీతో మోయలేని భారం

‘ఒక చీర తయారు చేయడం అంటే 17 విభాగాల ప్రక్రియ. ఇదంతా ఉత్పత్తిదారులు, వ్యాపారులు, కళాకారుల్లో ఒకరితో మరొకరికి అనుబంధం గల ప్రక్రియ. ప్రస్తుతం జీఎస్టీ అమలులోకి రావడంతో వీరంతా చార్టర్డ్ అక్కౌంటెంట్లను నియమించుకోవాల్సి వస్తున్నది. అంతే కాదు కంప్యూటర్ ఆపరేటర్లుగా, స్మార్ట్ ఫోన్ ఆపరేటర్లుగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ సంప్రదాయంగా గుజరాతీలంతా సాధారణ వ్యాపారాన్ని అర్థం చేసుకుని జీవనం సాగించే వారే తప్ప ఆర్థిక వేత్తలు కాదు. ఈ తరుణంలో కేంద్రం అమలులోకి తెచ్చిన సంక్లిష్టమైన జీఎస్టీ విధానం మాపై మోయలేని భారం మోపింది. లేని తలనొప్పులు తెచ్చి పెట్టింది. అనవసర ఒత్తిళ్లు తెచ్చి పెట్టిన జీఎస్టీ ప్రభావంతో త్వరలో జరిగే ఓట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది‘ అని నితిన్ భాయి అనే బట్టల వ్యాపారి చెప్పారు. ఆయన సింథటిక్ ఫ్యాబ్రిక్ లో 16 ఏళ్లుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

 వ్యాపారుల సమస్యల పట్ల సర్కార్ సాచివేత ధోరణి

వ్యాపారుల సమస్యల పట్ల సర్కార్ సాచివేత ధోరణి

జీఎస్టీ ఎప్పటికైనా అమలులోకి వస్తుందన్న సంగతి వ్యాపారులందరికీ తెలియడమే కాదు అంగీకారం కూడా. కానీ నూతన పన్ను విధానం అమలు తీరుపై స్థానిక వ్యాపారుల ఆందోళనను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. కనీసం వ్యాపారుల పట్ల సానుకూతి కూడా ప్రదర్శించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత టెక్స్ టైల్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, టెక్స్ టైల్ జీఎస్టీ సంఘర్ష్ సమితి కన్వీనర్ తారాచంద్ కసర్ సుదీర్ఘ కాలంగా బీజేపీకి మద్దతుదారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిల్క్ సిటీగా పేరొందిన సూరత్ పట్టణంలో రాహుల్ గాంధీ రోడ్ షో తర్వాత జీఎస్టీ అమలులో మార్పులు, చేర్పులు వస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. కానీ తారాచంద్‌కు మాత్రం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. ‘మేం పలుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశం. కానీ హడావుడిగా అమలు చేయడంతోపాటు వ్యాపారుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మాకు డెమో కూడా నిర్వహించలేదు. టెక్స్ టైల్ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. నూలుపై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందే' అని స్పష్టం చేశారు.

రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే ఏడాదికోసారి ఫైలింగ్

రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే ఏడాదికోసారి ఫైలింగ్

నూలుపై ప్రభుత్వం విధించే పన్ను శ్లాబ్ మొదట 18 శాతంగా ఉండేది. బట్టల వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాన్ని 12 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్నయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఏటా రూ.1.5 కోట్ల తక్కువ టర్నోవర్ గల వ్యాపారులు.. త్రైమాసికానికి ఒకసారి పన్ను ఫైలింగ్‌కు బదులు ఏడాదికొకసారి ఫైల్ చేసేందుకు రాయితీ కల్పించారు. దేశంలో చేతులతో తయారుచేసే ఫైబర్, ఫిలమెంట్ ఫైబర్ తయారీలో 40 శాతం సూరత్ పట్టణ వాసులదే. సూరత్ పట్టణంలోనే రోజూ మూడు కోట్ల మీటర్ల ఫ్యాబ్రిక్ ముడి సరుకు తయారవుతుంది. ‘సూరత్ పట్టణ వాసుల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి తెలుసు' అని తారాచంద్ కసర్ తెలిపారు. ఆగ్రహంతో వ్యవహరిస్తున్న పట్టణ వ్యాపారులు పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. బల్వంత్ జైన్ అనే మరో బట్టల వ్యాపారి ఉధ్నాలో జీఎస్టీని నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించిన సంగతిని గుర్తుచేశారు. అసంఘటిత రంగంలో జరిగే పలు లావాదేవీలను ఇక నుంచి ఎంట్రీలు చేర్చాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రూ.1000 విలువైన ఆర్డర్‌పై రూ.200 చెల్లించాల్సి వస్తుందని పట్టణ బట్టల వ్యాపారులు చెప్తున్నారు. తాము ఒక కంప్యూటర్ ఆపరేటర్, బిజినెస్ కన్సల్టెంట్‌లను నియమించుకోవడానికి అభ్యంతరం లేదన్నారు.

 రూ.50 వేలు దాటితే ‘ఈ-వే'లో పేరు నమోదు తప్పనిసరి

రూ.50 వేలు దాటితే ‘ఈ-వే'లో పేరు నమోదు తప్పనిసరి

సూరత్ పట్టణంలోని సోస్యో సర్కిల్.. సెంట్రల్ మార్కెట్ అండ్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్ అభిప్రాయాలు కొంచెం మరొకలా ఉన్నాయి. ఒక మిల్లు నడుపుతున్న వ్యాపారి కొన్నేళ్లుగా బీజేపీకి మద్దతుదారుగా ఉండటానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాదిరిగా సులభ వాణిజ్యం విధానం అమలు చేయడమే కారణం. కానీ కొన్ని నెలలుగా జీఎస్టీ అమలులోకి రావడంతో మార్కెట్ వర్గాలు ఆయా చట్టంలో నిబంధనలు అమలు చేయడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ వ్యాపారులు ‘ఈ- బే' బిల్లు తయారు చేయడంలో విఫలం అయ్యారు మరి. ప్రస్తుతం ఏ వ్యవస్థ కూడా అందుబాటులో లేనందున ‘ఈ - బే' విధానం అమలు వచ్చే మార్చి వరకు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా వస్తువులు కొనుగోళ్లు రూ.50 వేలు దాటితే ‘ఈ - బే' బిల్లులో పేరు నమోదు చేసుకోవాల్సిందే.

 కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయ లేమి

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయ లేమి

జీఎస్టీని స్వాగతించిన మూడో తరం ఫ్యాబ్రిక్ ఉత్పత్తి దారు హర్షిత్ జరీవాలా.. చేనేత పారిశ్రామిక రంగం సంఘటిత రంగం వైపు అడుగులేస్తున్నదని అన్నారు.‘ప్రతి వస్తువు రవాణా చేయడానికి ‘ఈ- వే' బిల్లు తప్పనిసరిగా తయారు చేయాల్సిందే. దీనివల్ల జాతీయ రహదారులపై వ్యాపారులు, రవాణా సంస్థల యజమాన్యలు బాధ్యతలు రోజురోజుకు పెరిగిపోయాయి' అని తెలిపారు. ఇంతకుముందు ముంబై నుంచి భీవండికి సరుకులు పంపే వ్యాపారులు.. సూరత్ పట్టణంలో బిల్లులు ప్రదర్శించాల్సి ఉంటుంది. అదీ సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) రెండు శాతం, వాల్యూయాడెడ్ టాక్స్ (వ్యాట్) ఐదు శాతం పన్ను చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లేమితో చాలా మంది మోసానికి గురవుతున్నారు' హర్షిత్ పేర్కొన్నారు. అంతే కాదు హార్షిత్ ఇంతకుముందు నూలుపై 18 శాతం పన్ను చెల్లిస్తే బట్టలు పన్ను లేకుండా విక్రయించే వారమని తెలిపారు. గతంలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల నెట్‌వర్క్ సమన్వయంతో పని చేసినప్పుడు ఐదు శాతం వ్యాట్ చెల్లించే వారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బట్టల వ్యాపారుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రమే ఆ పార్టీతో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నారని, సాధారణ ప్రజానీకంలో అటువంటి ఆలోచనేమీ లేదని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Surat mehnat se nahi darta hai (People of Surat don’t shirk hard work). These were the words of Nitin bhai, who owns a fabric shop along the Ring Road in the heart of central Surat. The district is a permanent home to countless packets of silk, synthetic, cotton, viscose, nylon in blue, white, green, red, black with paintings and glitters on them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి