కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్‌రేప్
గుర్గావ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంజీ రోడ్డులోని సహారా మాల్ నుంచి తిరిగి వస్తున్న 26ఏళ్ల మహిళపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బెవెర్లీ పార్క్-1 ప్రాంతం నుంచి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కారులో ఆమెను ఎత్తుకుపోయిన ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, సోమవారం ఉదయం బాధితురాలు వసంత్ విహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు గుర్గావ్‌కు బదిలీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన రెండేళ్ల కొడుకుతో కలిసి ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో నివసిస్తోంది. గత ఆదివారం రాత్రి గుర్గావ్ నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై గ్యాంగ్ జరిగిందని, ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశామని సెక్టార్ 29 పోలీస్ స్టేషన్ ఏసీపీ డీఎల్ఎఫ్ రమేశ్ పాల్ వెల్లడించారు.
ఇంటికి చేరుకునేందుకు ఇఫ్కో చౌక్ వద్ద ఆటో ఎక్కిన ఆమెను బెవెర్లీ పార్క్-1 సమీపంలో తెల్లరంగు కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి తమతో తీసుకెళ్లారని.. కారులో ముగ్గురు పురుషులతో పాటు మహిళ కూడా ఉందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. ఆ తర్వాత తనపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications