బెడ్ రూంలోకి వెళ్లి చెక్ చేయలేం!: సెక్స్ రాకెట్‌పై ప్రియాంక చోప్రా

ముంబై: తన ప్రాపర్టీలో బట్టబయలైన సెక్స్ రాకెట్ గురించి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పెదవి విప్పారు. తాను భవనాన్ని అద్దెకు ఇచ్చానని ఆమె తెలిపారు. అద్దెకు ఇచ్చిన తరువాత వారి బెడ్ రూంలో ఏం జరుగుతుందో ప్రతి రోజూ వెళ్లి చెక్ చేయం కదా? అని ఆమె ప్రశ్నించారు.

తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, విచారణ చేస్తున్న పోలీసులకు సహకరిస్తానన్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలిపారు.

కాగా, ప్రియాంక చోప్రాకు షాకింగ్ అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ప్రాపర్టీ (బిల్డింగ్)లో సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. ఈ సంఘటన అటు పోలీసులను, ఇటు ఆమె అభిమానులను కూడా నిర్ఘాంత పోయేలా చేసింది. ఆమెకు సంబంధించిన సదరు బిల్డింగును వేరే వ్యక్తులు లీజు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

'Had No Clue About Alleged Sex Racket in Flat'

ఇటీవల ముంబైలోని వెర్సోవాలో ఓ స్పాలో గుట్టుగా నడుస్తున్న సెక్స్ రాకెట్ పోలీసులు రట్టు చేసారు. విటులతో పాటు పలవురు ప్రాసిట్యూట్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన వెలుగు చూసే వరకు ప్రియాంక చోప్రాకు గానీ, ఆమె కుటుంబీలకు గానీ ఈ భాగోతం గురించి తెలియదని పోలీసులు చెప్పుకొచ్చారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో ముగ్గురు మహిళలు, మేనేజర్ దొరికారు.

అయితే స్పా ఓనర్ మాత్రం పరారీలో ఉన్నట్లు తేలింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. స్పా ఓనర్ ప్రియాంక కుటుంబీలను నమ్మించి మోసం చేసి... స్పా ముసుగులో ఇలాంటి అసంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో స్పా ఓపెనింగ్ సమయంలో ప్రియాంక మదర్, బ్రదర్ కూడా హాజరయ్యారు. ఈ సంఘటనతో ప్రియాంక చోప్రా చాలా డిస్ట్రబ్ అయిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+