మహా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.. ఆమె అందానికి అందరూ ఫిదా!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 26 తారీకు వరకు నిర్వహించే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో సాధువులు, నాగ సాధువులు, ఋషులతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

మహా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఆమెనే
ఇక నిన్న మకర సంక్రాంతి సందర్భంగా రెండు కోట్ల మందికి పైగా భక్తులు సంగమ స్నానం చేశారు. ఇంత ఘనంగా కోట్లాదిమంది భక్తులతో, సాధు పుంగవులతో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక మహిళా సాధ్వి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాలో ఈమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

harsha Richhariya is the center of attraction at the Maha Kumbh Mela Everyone is captivated by her beauty

సాధ్వి అందానికి ముగ్దులవుతున్న యాత్రికులు
రుద్రాక్షలతో, పూలమాల,తో నుదుటిపై తిలకంతో అచ్చం దివి నుంచి దిగివచ్చిన దేవకన్య, తపస్వినిలా మారినట్టు ఓ సాధ్వి మెరిసిపోతుంది. ఇక ఆ సాధ్విని చూసిన వారంతా ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు. ఇంత అందంగా ఉన్న ఈమె సాధ్విగా మారడం ఏమిటి అని చర్చించుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరు ఈమె అని తెగ వెతుకుతున్నారు.

యాక్టర్, యాంకర్, ప్రముఖ మోడల్ అయిన హర్ష రిచార్య
ఇక వైరల్ ఫోటో, వీడియోలో ఉన్న సాధ్వి పేరు హర్ష రిచార్య. వయసు 30 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ఈమె మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. ప్రముఖ మోడల్ గానూ, యాంకర్ గాను, యాక్టర్ గాను ఆమె ఎన్నో షోలను కూడా హోస్ట్ చేశారు. మనదేశంలోనే కాదు విదేశాలలో జరిగిన ఈవెంట్స్ లో కూడా ఆమె హోస్ట్ గా పని చేశారు.

సాధ్విగా మారిన హర్ష రిచార్య
అయితే రెండేళ్ల క్రితం హర్ష రిచార్య బాహ్య ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవనాన్ని ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లోని నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలిగా ఆయన మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం సాధ్వి హర్ష రిచార్య మతపరమైన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్ ను చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోయర్లతో ఉన్నారు.

సన్యాస మార్గాన్ని ఎంచుకున్న హర్ష రిచార్య
కేవలం 30 సంవత్సరాల వయసులోనే శాంతియుత జీవనం కోసం సన్యాస మార్గాన్ని ఎంచుకున్నట్టు తనకు ఇది ఎంతో తృప్తినిచ్చినట్లుగా సాధ్వి చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మహా కుంభమేళాలో ఈమె అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+