నవీన్ జిందాల్ స్టైలే వేరు..!!
Haryana Assembly elections 2024: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఒకే విడతలో ఆయా అసెంబ్లీ స్థానాలన్నింట్లోనూ ఓటింగ్ జరుగుతోంది.
అసెంబ్లీపై పట్టు సాధించడానికి భారతీయ జనతా పార్టీ- జన్‌నాయక్ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. పోటీపడి ప్రచార పర్వాన్ని నిర్వహించాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలనే పట్టుదలను ప్రదర్శించాయి కాంగ్రెస్- దాని మిత్రపక్షాలు.

దీని ఫలితం ఏమిటనేది ఈ నెల 8వ తేదీన తేలిపోనుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు హర్యానాలో పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మంత్రి అనిల్ విజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లాడ్వా నుంచి నాయబ్ సింగ్, అంబాలా కంటోన్మెంట్ నుంచి అనిల్ విజ్.. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఆయన తనయుడు, కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా రోహ్‌తక్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గర్హీ సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి భూపిందర్ సింగ్ హుడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
#WATCH | Haryana: BJP MP Naveen Jindal reaches a polling station in Kurukshetra on a horse, to cast his vote for the Haryana Assembly elections. pic.twitter.com/cIIyKHXg0n
— ANI (@ANI) October 5, 2024
మరో మాజీ ముఖ్యమంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాష్ చౌతాలా.. సిర్సాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో కాంగ్రెస్‌కు చెందిన సిర్సా ఎంపీ కుమారి సెల్జా, కురుక్షేత్ర బీజేపీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఉన్నారు. నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం ఆకట్టుకుంది.
కాగా- ఉదయం 11 గంటల వరకు 22.70 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధిక ఓటింగ్ 27.94 శాతం పల్వాల్ నియోజకవర్గంలో రికార్డయింది. అత్యల్పంగా 13.36 శాతం మేర పోలింగ్ పంచ్‌కులాలో నమోదైంది. జింద్- 27.20, మెవాట్- 25.65 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఈసీ వివరించింది.












Click it and Unblock the Notifications