వర్షాకాలంలో సౌత్ ఇండియా టూర్.. తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

వేసవి కాలం పూర్తి అయింది. జూన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో వర్షాలు ప్రారంభం కానున్నాయి. అయితే వేసవిలో పలు కారణాల వల్ల ఏ టూర్ లకూ వెళ్లలేకపోయారా..? అయితే తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంటాయి. పచ్చని కొండలు, పొగమంచుతో కప్పుకున్న లోయలు, ఉప్పొంగే జలపాతాలు పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటాయి. ఇలా ప్రకృతి సోయగాలను ఆస్వాధించాలనుకునేవారికి ఈ ప్రాంతాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మరి ఆ ప్రాంతాల విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..

విశాఖపట్నం నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, కొండలు, జలపాతాలు ఉన్నాయి. భీమిలీ బీచ్, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్ టూరిస్టులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. అలాగే వైజాగ్ కు దగ్గరలో అరకు వ్యాలీ, బొర్రా గుహలు, కాఫీ తోటలు చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

కొడైకెనాల్ తమిళనాడులో ఉన్న ఓ అందమైన హిల్ స్టేషన్. వర్షాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొడైకెనాల్ లో కొడై సరస్సు, కోకర్స్ వాక్, పిల్లర్ రాక్స్, గుణ కేవ్స్, పైన్ ఫారెస్ట్ ఇలా చాలా అద్భుతమైన ప్రదేశాలు పర్యటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, ఫ్యామిలీ ట్రిప్స్ కు, కొత్తగా పెళ్లి అయిన జంటలకు అనువైన ప్రదేశంగా చెబుతారు.

SouthIndia in Monsoon Season Explore These Stunning Must-Visit Places and Attractions SouthIndia

దండేలి ప్రాంతం సాహస యాత్రలు ఇష్టపడే వారికి అనువైన పర్యటక ప్రాంతంగా ఉంది. అనేక ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గ ధామంగా ఉంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులు, లోయలు, నదులతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్ వంటి కార్యక్రలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ దండేలి వన్యప్రాణి అభయారణ్యం, కావాల గుహలు చాలా ప్రసిద్ధి. అలాగే కేరళలోని వయనాడ్ ప్రాంతం పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి దట్టమైన కొండలు, కాఫీ, తేయాకు తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, జలపాతాలు పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+