వర్మ, వంగవీటికి దక్కే పదవులేంటి - కీలక పరిణామాలు..!?

ఏపీలో కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీలో సీట్లు త్యాగం చేసిన సీనియర్లు.. ముఖ్య నేతలు పలువురు పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ పొందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలం పూర్తయింది. అటు వరుసగా రాజ్యసభ.. ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవుతున్నాయి. దీంతో.. కొందరు నేతలతో పదవుల విషయం లో పార్టీ నాయకత్వం ఇస్తున్న సంకేతాలు మరింత ఆశలు పెంచుతున్నాయి.

ఏపీలో పలు విడతలుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నుంచి అవకాశం దక్కింది. రాజ్యసభ.. ఎమ్మెల్సీ పదవులను ఇప్పటి వరకు అయిన ఖాళీల ను భర్త చేసారు. అయితే, పిఠాపురం వర్మ .. వంగవీటి రాధ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో, తాజాగా వర్మ తో పాటుగా వంగవీటి రాధాకు కు ఇచ్చే పదవి పైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ గా కొద్ది రోజుల క్రితమే వర్మను బాధ్యతల నుంచి తప్పించారు. 2024 ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని.. వర్మ భవిష్యత్ తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. పవన్ కు భారీ మెజార్టీ రావటం లో వర్మ క్రియాశీలకంగా పని చేసారు. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది.

 ఒక రోజు మొత్తం కేటాయిస్తా, నాదీ భరోసా - పవన్..!!
ఒక రోజు మొత్తం కేటాయిస్తా, నాదీ భరోసా - పవన్..!!
tdp-likely-to-announce-key-posts-for-pithapuram-varma-and-vangaveeti-radha-soon-as-reports

పార్టీ నాయకత్వం కసరత్తు

అదే విధంగా వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజాగా వర్మ తో పాటుగా రాధాకు త్వరలోనే రాష్ట్ర స్థాయి లో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ ఎమ్మెల్సీ పదవుల పైన గతంలో హామీ ఇచ్చినా.. ఇదే రకమైన హామీ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువ గా ఉంది. అదే సమయంలో వారి సొంత నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి.
దీంతో, ఆ ఇద్దరికీ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందనే వాదన జనసేనలో ఉంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన పలువురు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో.. ఈ ఇద్దరికీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎమ్మెల్సీ కాకుండా, ఈ ఇద్దరి ఏ పదవులు ఇస్తారు.. అందుకు ఈ ఇద్దరూ సిద్దంగా ఉన్నారా అనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+