మమతా బెనర్జీకు బిగుస్తున్న ఉచ్చు: ఇంటి వద్ద భారీగా సీఐడీ మోహరింపు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వివాదాల్లో చిక్కుకున్నారు. అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. ఆమె నివాసం, పార్టీ సెంట్రల్ కార్యాలయం వద్ద ఈ మధ్యాహ్నం సీఐడీ అధికారులు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. పార్టీలో చెలరేగిన ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ వివాదం, దానికి కొనసాగింపుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టారు.

దర్యాప్తు సంస్థ అధికారులతో పాటు, కాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, భారీగా మహిళా పోలీసులతో కూడిన బృందం కొద్దిసేపటి కిందటే మమతా బెనర్జీ నివాసం కోల్‌కతా కాళీఘాట్ సమీపంలోని 30బీ హరీష్ ఛటర్జీ వీధికి చేరుకుంది. అసెంబ్లీ స్పీకర్‌కు ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం అందజేసిన ప్రతిపాదన పత్రంపై ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ జరిగాయనే ఆరోపణలపై సీఐడీ గతకొన్ని రోజులుగా విచారణ జరుపుతోంది.

CID Lands at Kalighat as Mamata Banerjee Under CID Scrutiny Over Alleged MLA Signature Forgery

ఈ క్రమంలో తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి పంపిన నోటీసులకు వచ్చిన సమాధానమే ఈ తాజా పరిణామానికి ప్రధాన కారణమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎమ్మెల్యేల సంతకాలను సేకరించామంటూ అభిషేక్ బెనర్జీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే విచారణలో భాగంగా తాము సోదాలకు వచ్చామని సీఐడీ అధికారులు వివరించారు. దర్యాప్తు బృందం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా తృణమూల్ నేత, మాజీ ఎంపీ సుభాశిష్ చక్రవర్తి మాట్లాడారు. అభిషేక్ బెనర్జీ అందుబాటులో లేనందున కార్యాలయంలోకి సోదాలకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ తిరిగి వచ్చిన తర్వాత సీఐడీ వచ్చి నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించుకునేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాకు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో నెలకొన్న వివాదమే ఈ పరిణామాలకు నాంది పలికింది.

పార్టీ అధికారికంగా సోమన్ దేవ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించగా, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. క్రమశిక్షణను ధిక్కరించి, 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 58 మంది బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ వైపు నిలబడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారం ఎఫ్ఐఆర్ నమోదై సీఐడీ దర్యాప్తుకు దారితీసింది. గత వారం జరిగిన నాటకీయ పరిణామాల్లో, రెబల్ ఎమ్మెల్యేలు శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+