గుర్గావ్ బాలుడి హత్య కేసు: సీబీఐకి అప్పగించిన సీఎం, ప్రభుత్వం చేతుల్లోకి స్కూల్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ప్రద్యుమ్న ఠాకూర్(7) హత్య కేసును సీబీఐ విచారణకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సిఫార్సు చేశారు. అంతేగాక, 3నెలలపాటు స్కూల్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు.

ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ టాయ్‌లెట్‌లో గత వారం రెండవ తరగతి విద్యార్థి ప్రద్యుమ్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే రోజు స్కూల్ బస్ కండక్టర్లలో ఒకరైన నిందితుడు అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Haryana CM hands over Gurgaon schoolboy murder case to CBI

అనంతరం బాలుడిని హతమార్చినట్లు అశోక్ కుమార్ అంగీకరించాడు. కాగా, బాలుడి హత్య కేసులో స్కూల్ అధినేతలు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Haryana CM Manohar Lal Khattar handed over the Gurgaon schoolboy murder case to the Central Bureau of Investigation (CBI).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X