హర్యానాలో శాంతించిన రైతులు-ఆగస్టు 28 లాఠీఛార్జ్ పై జ్యుడిషియల్ విచారణ
హర్యానాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా సాగిస్తున్న నిరసనలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఈ మేరకు రైతు సంఘాలు ఇవాళ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఆందోళనలు చేస్తున్న తమపై ఆగస్టు 28న పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ రైతులు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు ప్రభుత్వమే వెనక్కి తగ్గింది.
హర్యానాలో రైతులు చేపట్టిన ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లుచర్చలు జరిపింది. అయినా రైతులు వెనక్కి తగ్గకపోగా నిరనసలు మరింత పెంచారు. దీంతో అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. దీంతో చేసేది లేక ఆగస్టు 28న రైతులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ పై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రబుత్వం ప్రకటించింది. అదే సమయంలో తమ డిమాండ్ నెరవేరడంతో రైతులు కూడా ఆందోళనలు విరమించాలని నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి ఐదు రోజులుగా కర్నాల్ ను చుట్టుముట్టిన రైతు సంఘాలు.. భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగించాయి. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని డిమాండ్ చేశాయి. ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ లో పలువురు రైతులు గాయపడటంతో వారిని ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం రైతులకు చికిత్స అందిస్తాం కానీ పోలీసులపై చర్యలు తీసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో రైతులు తమ ఆందోళన మరింత తీవ్రతరం చేసాయి. చివరకు రైతుల ఆందోళనలకు ప్రభుత్వమే తలొగ్గాల్సి వచ్చింది.
వచ్చే ఏడాది హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ప్రభావం అక్కడి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై తీవ్రంగా పడుతోంది. నిత్యం రైతుల ఆందోళనలతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అదే సమయంలో నిరసనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ లో పలువురు రైతులు గాయపడ్డారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. చివరకు ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధపడటంతో రైతులు శాంతించారు.












Click it and Unblock the Notifications