ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కాపాడి.. 20రోజులపాటు రేప్ చేశాడు
ఫరీదాబాద్: హర్యానా రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ 25ఏళ్ల వివాహిత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. ఆ తర్వాత మహిళపై 20 రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. నిందితుడి వద్ద నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు, పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సందీప్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. తన తల్లి తిట్టడంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో మార్చి 17న బాధితురాలు ఇంటి నుంచి బయటికి వచ్చేసింది.

కాగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన బాధితురాలిని నిందితుడు సందీప్ మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఘజియాబాద్‌కు తీసుకెళ్లిన సందీప్, ఓ తెల్ల కాగితం మీద సంతకం పెట్టించి, తనను వివాహం చేసుకోవాలని బాధితురాలిని బలవంతం చేశాడు.
తనకు వివాహం అయిందని చెప్పడంతో.. నిందితుడు 20 రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని ఓ అద్దె గదికి తీసుకెళ్లిన నిందితుడు, తన ఇద్దరు స్నేహితులతోపాటు లైంగిక వేధించాడని తెలిపింది. అనంతరం తనను వదిలిపెట్టి పరారయ్యారని చెప్పింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications