వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ-హర్యానా బోర్డర్ సీల్: కరోనా కేసులు పెరగడంతో, హర్యానా సర్కార్ నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక్కడినుంచి పొరుగురాష్ట్రం హర్యానాకు వలసకూలీలు వెళుతున్నారు. వారి వల్ల హర్యానాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో హర్యానా-ఢిల్లీ సరిహద్దును మరోసారి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వస్తోన్న వారితో వైరస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది.

తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ లేఖ రాశారు. ఢిల్లీ నుంచి వస్తోన్న వారితోనే వైరస్ కేసులు పెరుగుతున్నాయని.. దీంతో వైరస్ నివారణ సాధ్యం కావడం లేదు అని పేర్కొన్నారు. గత వారం రోజుల్లో నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఫరీదాబాద్ నుంచి 98, 111 గురుగ్రామ్, జాజ్ఝర్ 6, సోనిపట్ నుంచి వచ్చినవారితో 27 మందికి వైరస్ సోకిందని గుర్తుచేశారు.

Haryana to seal borders with Delhi..

కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దును మూసివేశారు. అయితే జాతీయ రహదారిని మూసివేస్తే అత్యవసర సేవల సంగతి ఏంటీ అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హర్యానా సరిహద్దును తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వైరస్ కేసులు పెరుగుతున్నందున.. మరోసారి బోర్డర్ మూసివేయాలని హర్యానా సర్కార్ నిర్ణయం తీసుకొక తప్పలేదు.

English summary
Haryana government has announced that it is going to seal its border with Delhi once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X