మాజీ ప్రియుడిని ముక్కలు ముక్కలు చేయాలని బాంబుతో ?
పల్వాల్: మాజీ ప్రియుడిని అంతం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ మహిళ నాటు బాంబులతో పేల్చేయాలని పక్కా ప్లాన్ వేసి అడ్డంగా బుక్కయ్యింది. మరో మాజీ ప్రియుడితో కలిసి ఓ వృద్దుడిని దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
పల్వాల్ జిల్లా పోలీసు అధికారి షేర్ సింగ్ కథనం మేరకు 2010లో ఆర్తీ (35) అనే మహిళ రాకేష్ అనే వ్యక్తిని కలిసింది. రాకేష్ కు అప్పటికే పెళ్లి అయ్యింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్తీ కలిసిన తరువాత ఆమె మాయలో పడిన రాకేష్ భార్య, పిల్లలను వదిలేశాడు.
ఆర్తీతో కలిసి వేరుగా కాపురం పెట్టాడు. పెద్దలు ఎంత చెప్పినా రాకేష్ తన పద్దతి మార్చుకోలేదు. ఆర్తీని వదలకుండా ఆమెతోనే గడిపాడు. తరువాత రాకేష్ దూరపు బంధువైన బాబూలాల్ (65) అనే ఆయన రాకేష్ కు బుద్ది మాటలు చెప్పారు.

కామంతో కళ్లు మూసుకుపోయిన రాకేష్ కు చివరికి బుద్ది వచ్చింది. తన భార్య, పిల్లలను చూసుకోవాలని అనుకున్నాడు. ఆర్తీని వదిలి భార్య, పిల్లల దగ్గరకు చేరుకున్నాడు. ఆర్తీ ఈ విషయం జీర్ణించుకోలేకపోయింది.
పగతో రగిలిపోయిన ఆర్తీ ఎలాగైనా రాకేష్ అంతు చూడాలని ప్లాన్ వేసింది. తన మాజీ ప్రియుడు ప్రదీప్ తో కలిసి రాకేష్ ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. రాకేష్ ను ముక్కలు ముక్కలు చెయ్యాలని స్కెచ్ వేసింది.
ఆర్తీ, ప్రదీప్ కలిసి టపాసుల పౌడర్, గాజు ముక్కలు, రాళ్లు కలిపి ముడి బాంబు తయారు చేశారు. అయితే అప్పటికే బాబూలాల్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పక్కా సమాచారం సేకరించి ఆర్తీని అదుపులోకి తీసుకున్నారు.
బాబూలాల్ ను తామే హత్య చేశామని ఆర్తీ అంగీకరించింది. తరువాత ఆర్తీ మాజీ ప్రియుడు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆర్తీ, ప్రదీప్ ను అరెస్టు చేసి నాటు బాంబును స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి షేర్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications