వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో భారత్‌కు సీరం సీఈవో పూనావాలా- నెలకు 100 మిలియన్ల డోసులకు రెడీ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో టీకా ప్రిన్స్‌గా పేరుతెచ్చుకున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కొన్ని రోజుల క్రితం సైలెంట్‌గా లండన్‌ వెళ్లిపోయారు. భారత్‌లో రాజకీయ నేతలు,వ్యాపార వర్గాల నుంచి వ్యాక్సిన్ల కోసం ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన లండన్‌ వెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన అక్కడి నుంచి అంతర్జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలను గమనిస్తే ఎట్టకేలకు పూనావాలాకు తత్వం బోధపడినట్లు తెలుస్తోంది.

 త్వరలో భారత్‌కు పూనావాలా

త్వరలో భారత్‌కు పూనావాలా

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎదురవుతున్న వ్యాక్సిన్ల డిమాండ్‌ను తట్టుకోలేక రాత్రికి రాత్రి లండన్ వెళ్లిపోయిన సీరం ఇన్‌సిట్యూట్‌ సీఈవో ఆదార్‌ పూనావాలా త్వరలో తిరిగి భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో రాజకీయనేతలు, వ్యాపార వర్గాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన ఆయన.. త్వరలో భారత్‌కు తిరిగి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన అంతర్జాతీయ మీడియాతో పాటు ట్విట్టర్‌లోనూ పంచుకుంటున్నారు. అయితే ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనేది మాత్రం కచ్చితంగా తెలియడం లేదు.

 పూనావాలాకు తత్వం బోధపడిందా ?

పూనావాలాకు తత్వం బోధపడిందా ?

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ కలిగిన భారత్‌లో కరోనా రెండోదశ సందర్భంగా వ్యాక్సిన్లకు ఎంత డిమాండ్‌ ఉంటుందో పూనావాలాకు తెలియంది కాదు. కానీ కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో మౌనంగా ఉండటం, సెకండ్‌ వేవ్‌ మొదలుకాగానే ఉరుకులు పరుగులు పెట్టించడం, అవసరమైన సాయం అందించకపోవడం వంటి కారణాలతో పూనావాలా కూడా మౌనం వహించారు. అదే సమయంలో పెరిగిన వ్యాక్సిన్ల డిమాండ్‌ ప్రభావం ఆయనపై తీవ్రంగా పడింది. దీంతో లండన్ వెళ్లిపోయిన పూనావాలా ఇప్పుడు క్రమంగా వాస్తవం అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 నెలకు 100 మిలియన్‌ డోసులకు రెడీ

నెలకు 100 మిలియన్‌ డోసులకు రెడీ

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్ధ అయిన పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌..నెలకు 72 మిలియన్ల కోవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సీరంపైనే ఆధారపడాల్సిన పరిస్దితి. ఈ ఉత్పత్తిని భారీగా పెంచాలనే డిమాండ్లు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో లండన్‌ నుంచి తిరిగి రాగానే ఈ ఉత్పత్తిని నెలకు 100 మిలియన్‌ డోసులకు పెంచుతామని పూనావాలా చెప్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్ల డిమాండ్‌ తట్టుకోలేక లండన్‌ వెళ్లిన పూనావాలా ఇప్పుడు 100 మిలియిన్‌ డోసులకు రెడీ అని చెప్పడం ఆహ్వానించదగిన పరిణామంగా కనిపిస్తోంది.

 అన్యాయంగా బాధితుడినయ్యా

అన్యాయంగా బాధితుడినయ్యా

ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ల తయారీ దారుగా ఉన్నప్పటికీ, భారత్‌తో పాటు విదేసాలకు సైతం వ్యాక్సిన్లు ఇస్తున్నప్పటికీ అన్యాయంగా తాను బాధితుడిగా మారానని ఆదార్‌ పూనావాలా అంతర్జాతీయ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వ్యాక్సిన్లపై ఆర్డర్లు పెట్టకుండా మౌనంగా ఉండి, సెకండ్‌ వేవ్‌ రాగానే పరుగులు తీయించడం వల్లే ఈ పరిస్దితి ఎదురైందన్నారు. అయితే త్వరలోనే ఏడాదికి 100 బిలియన్ల వ్యాక్సిన్లు తయారు చేసే సామర్ధ్యం తమకు ఉందని పూనావాలా తెలిపారు. ప్రస్తుతం వై కేటగిరీ సెక్యూరిటీ కవర్‌ కలిగిన పూనావాలా తాజాగా తనకు జడ్ కేటగిరీ కావాలంటూ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
What’s up exactly with India’s vaccine prince, Adar Poonawalla? Last Sunday, the Serum Institute chief executive tweeted he’d be back in India “in a few days” after stirring an uproar by saying he fled to London to escape threats from politicians and businessmen demanding to jump the vaccine queue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X