కచ్చితంగా చెప్పలేను.. పవన్ వస్తారో! రారో!: జేడీఎస్ నేత కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయినప్పటికీ.. జేడీఎస్ కూడా సత్తా చాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే గనుక.. జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే తామెవరికీ మద్దతినిచ్చేది లేదని, అవసరమైతే మళ్లీ ఎన్నికలకైనా వెళ్తామని ఆ పార్టీ ఇదివరకే స్పష్టం చేసింది.

ఇకపోతే కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీలు సినీ గ్లామర్ ను ఉపయోగించుకుంటున్నాయి. కన్నడ స్టార్స్ అయిన దర్శన్, సుదీప్ వంటి హీరోలు సీఎం సిద్దరామయ్య తరుపున ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ తరుపున పవన్ కల్యాణ్ కూడా ప్రచార బరిలో దిగుతారా? అని చాలామంది ఆ పార్టీ నేత కుమారస్వామిని ప్రశ్నిస్తున్నారు.

hd kumaraswamy on pawan kalyan over karnataka elections

తాజాగా ఆయనో తెలుగు టీవి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించగా.. ప్రచారానికి ఆయన వచ్చేది రానిది కచ్చితంగా చెప్పలేమన్నారు. గతంలో పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారని, అయితే, కొన్ని అనివార్య కారణాల వల్లే ఆయన ఇంతవరకూ రాలేకపోయారని అన్నారు.

ఇక కర్ణాటక ఎన్నికల్లో అందరు అంటున్నట్టు హంగ్ ఏర్పడే ఛాన్సే లేదని, తమ పార్టీ 120కి పైగా స్థానాలను సులువుగా గెలుస్తుందని కుమారస్వామి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+