వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: కూల్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? అయితే ఈ రోగాలకు స్వాగతం చెప్పినట్టే!!

|
Google Oneindia TeluguNews

చాలామంది విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. చాలా ఇళ్లల్లో కూల్ డ్రింక్స్ ను నిత్యావసర వస్తువులలాగా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. దాహం వేసినప్పుడు మంచి నీళ్లు తాగాల్సిన చోట, చాలామంది కూల్ డ్రింక్స్ తోనే దాహం తీర్చుకుంటారు. ఇక ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదేదో మర్యాదలా ఫీలై కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని, సాధ్యమైనంత వరకూ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

కూల్ డ్రింక్స్ తో అనేక ఆరోగ్య సమస్యలు

కూల్ డ్రింక్స్ తో అనేక ఆరోగ్య సమస్యలు

కూల్ డ్రింక్స్ మనకు తెలియకుండానే మన శరీరంపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి అని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ అధికంగా తాగడం వల్ల మధుమేహ సమస్య వస్తుందని హెచ్చరిస్తున్నారు. అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వారు టైప్ 2 డయాబెటిస్ బారినపడి ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్ఫారిక్ యాసిడ్ వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మనకు ఎముకల తీవ్రంగా బలహీనపడి పోయి, కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

కూల్ డ్రింక్స్ తో ఒబేసిటీ .. హైబీపీ

కూల్ డ్రింక్స్ తో ఒబేసిటీ .. హైబీపీ

చాలా స్ట్రాంగ్ గా ఉండే మన దంతాలు అధికంగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగని వారి దంతాల కంటే, కూల్ డ్రింక్స్ తాగే వారి దంతాలు తొందరగా అరిగిపోతాయి అని చెబుతున్నారు. అంతేకాదు కూల్ డ్రింక్స్ లో అధిక కేలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఇది కొవ్వుగా మారుతుందని, విపరీతంగా బరువు పెరగడానికి ఇది కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో ఉండే కెఫిన్, శరీరంలో అధికంగా డోపమైన్ ఉత్పత్తి చేస్తుందని, అందువల్ల రక్తపోటు పెరుగుతుందని, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కూల్ డ్రింక్స్ తరచూ తాగితే డేంజర్

కూల్ డ్రింక్స్ తరచూ తాగితే డేంజర్


తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో గుండె పనితీరు మందగిస్తుందని, హార్ట్ ఎటాక్ లేదా ఇతర సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. యాసిడ్ తో సమానమైన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎసిడిటి సమస్యలు వస్తాయని, జీర్ణశక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భవతులుగా ఉన్న మహిళలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే గర్భ స్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక అంతే కాదు కొన్ని సందర్భాలలో క్యాన్సర్ బారిన పడడానికి కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కూల్ డ్రింక్స్ విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలివే

కూల్ డ్రింక్స్ విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలివే


ఇక కూల్ డ్రింక్స్ విషయంలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ ను ఏదైనా పాకుడు పట్టిన ప్రదేశంలో కానీ, ఇంట్లో ఉపయోగించే వాష్ బేసిన్లలో కానీ పోసి చూడండి. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్ వాటిని పూర్తిగా తినేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది. ఇక అటువంటి కూల్ డ్రింక్స్ ను మనం తాగకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగుతున్న సమయంలో ఎంజాయ్ చేసినట్టుగా అనిపించినా, దాని దుష్ప్రభావాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక కూల్ డ్రింక్స్ తాగడం బాగా అలవాటైన వారు, ఆ అలవాటును మార్చుకోవడానికి కూల్ డ్రింక్స్ స్థానంలో పండ్ల రసాలను తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Are you drinking cool drinks? doctors warn that you are welcoming many diseases like diabetes, bone problems, high blood pressure and obesity etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X