వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: చలికాలంలో కీళ్ళనొప్పులు నరకం చూపిస్తున్నాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడేవారు ఇతర సీజన్ల కంటే, చలికాలంలో ఎక్కువ బాధను అనుభవిస్తారు. చలికాలంలో కనీసం లేచి తిరగలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు వైద్యులు. కీళ్లు గట్టిపడి పోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని నొప్పుల నుండి ఉపశమనం పొందాలి అని చెప్తున్నారు.

చలికాలంలో విపరీతమైన కీళ్ళ నొప్పులు .. చిట్కాలివే

చలికాలంలో విపరీతమైన కీళ్ళ నొప్పులు .. చిట్కాలివే



చలికాలం శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎముకలు, కీళ్ల నొప్పులు, కీళ్లు గట్టి పడడం వంటి ఇబ్బంది కలుగుతుంది. ఇక చలికాలంలో ఇతర సీజన్ల కంటే తక్కువగా మనుషుల శరీర కదలికలు ఉంటాయి. దీంతో ఇది మరింత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పి నుండి కాస్త ఉపశమనం పొందడానికి వైద్యులు అనేక చిట్కాలను సూచిస్తున్నారు.

సమతుల్యమైన ఆహారంతో కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం

సమతుల్యమైన ఆహారంతో కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం


ఇక వాటిలో ఒకటి సమతుల్య ఆహారం. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి, విటమిన్ సి మరియు విటమిన్ కె అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు. చలికాలంలో తీసుకునే ఆహార పదార్థాలలో నారింజ, క్యాబేజీ, బచ్చలి కూర, టమోటాలను చేర్చుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

శరీరాన్ని డీహైడ్రేడ్ గా ఉంచుకుంటే మంచిది

శరీరాన్ని డీహైడ్రేడ్ గా ఉంచుకుంటే మంచిది


ఇక చలికాలం కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు శరీరాన్ని డీహైడ్రేట్ కానీ ఇవ్వకూడదని సూచిస్తున్నారు. తగినంత ఎక్కువగా నీటిని తాగాలి అని సలహా ఇస్తున్నారు. చలికాలంలో నీటిని చాలా తక్కువగా తీసుకుంటామని, కానీ చలికాలంలో ఎక్కువ నీటిని తీసుకోవాలని శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచితే కాస్త నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేలా జాగ్రత్త అవసరం

శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేలా జాగ్రత్త అవసరం


ఇక చలికాలం శరీరాన్ని రక్షించుకోవడానికి, ఇక కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఎప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవటం పట్ల జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులకు మోకాలి గార్డులు ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఉండటంవల్ల కీళ్లు అంత తొందరగా గట్టి పడవని, మరీ ఎక్కువ నొప్పులు బాధించవు అని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామంతో మేలు

క్రమం తప్పకుండా వ్యాయామంతో మేలు


ఇక చలికాలంలో కీళ్లనొప్పులు, ఒళ్ళు నొప్పులతో ఇబ్బందిపడేవారు నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచిదని, శారీరక కదలికలు తగ్గడం వల్లనే నొప్పులు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి కీళ్ల నొప్పులు అంతగా బాధించవు అని సూచిస్తున్నారు. మొత్తానికి పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చలికాలంలో కీళ్లనొప్పులు, బాడీ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

helath tips: కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా? అయితే తినాల్సినవి.. తినకూడనివి ఇవే; తెలుసుకోండి!!helath tips: కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా? అయితే తినాల్సినవి.. తినకూడనివి ఇవే; తెలుసుకోండి!!

English summary
Are joint pains like hell in winter? For relief, doctors say that it is necessary to eat a balanced diet, drink more water, exercise, protect from cold, and maintain body temperature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X