వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: తేనెతో అధిక బరువుకు చెక్.. ఇంకా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!!

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆరోగ్య ఆహారంగా పరిగణించబడుతున్న తేనె అద్భుతమైన ప్రకృతి సృష్టి. అపారమైన ఆరోగ్య ప్రయోజనాలతో మనం ఉపయోగించే ఆహార పదార్థాలలో తేనె ఒకటి. ఇది అనేక సాంప్రదాయ ఔషధాలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనె కీలకంగా పనిచేస్తుంది. తేనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనాదిగా మానవాళికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఇక అటువంటి తేనే ఎన్ని విధాలుగా మనకు మేలు చేస్తుందనే అంశాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

 బరువు తగ్గించటంలో తేనె పాత్ర ఇలా

బరువు తగ్గించటంలో తేనె పాత్ర ఇలా


తేనే అధిక బరువును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. తేనె శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తాగినా, ఉదయం లేచిన వెంటనే పరగడుపున గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగినా జీవక్రియ మెరుగుపడుతుందని బరువును తగ్గించడంలో తేనె కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

తేనేతో వ్యాధినిరోధక శక్తి పెరుగుదల

తేనేతో వ్యాధినిరోధక శక్తి పెరుగుదల

ఇక తేనెలో ఉండే లెక్కలేనన్ని ఔషధ గుణాల కారణంగా , తేనే అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. తేనే అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల, నిత్యం ఉపయోగించే వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని వివిధ హానికరమైన బ్యాక్టీరియాతో, వైరస్ లతో పోరాటం చేస్తాయి. గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు కూడా తేనె తీసుకుంటే ఇన్ఫెక్షన్ నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది.

చర్మ సౌదంర్యాన్ని పెంపొందించటంలో తేనెది కీలక పాత్ర

చర్మ సౌదంర్యాన్ని పెంపొందించటంలో తేనెది కీలక పాత్ర

ఇక చర్మ సౌందర్యానికి కూడా తేనే ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరానికి కావాల్సిన తేమతో పాటు, పోషణ లక్షణాలు పుష్కలంగా ఉన్న తేనె, ఉత్తమమైన సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మానికి తేనె ఎంతగానో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చాలామంది మెరిసే చర్మం కోసం వివిధ పదార్ధాలతో తేనెను కలిపి ముఖానికి మాస్క్ లు వేస్తారు. చలికాలంలో పగిలిపోయిన పెదాలను నయం చేయడానికి, బయట ఎక్కువగా తిరగడం వల్ల కోల్పోయిన శరీర రంగును తిరిగి తెచ్చుకోవడానికి తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంపై ఎక్కడైనా గాయమైనా, దెబ్బ తగిలినా, ఇన్ఫెక్షన్ ఉన్నా దానిపై తేనె రాస్తే అది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 తేనెతో జ్ఞాపకశక్తి మెరుగుదల

తేనెతో జ్ఞాపకశక్తి మెరుగుదల

తేనే తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. తేనే మనిషిలోని ఏకాగ్రతను పెంచుతుంది. నిత్యం తేనే తీసుకుంటే మంచి ఆరోగ్యం సొంతమౌతుంది. మన మెదడుకు రక్తప్రసరణను సాఫీ చేయడంలో, జ్ఞాపక శక్తిని కోల్పోయే ప్రమాదాన్ని దూరం చేయడంలో తేనె గణనీయమైన పాత్రను పోషిస్తుంది. తేనే తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా జరిగి మన మెదడు పై ఉండే ఒత్తిడిని నివారిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి పెంపొందడమే కాకుండా, ఆరోగ్యవంతులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that by consuming honey every day, can lose over weight, improve skin beauty, increase immunity and improve memory. It is said that consuming honey provided by nature in a systematic manner gives health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X