
health tips: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే!!
బ్రేక్ ఫాస్ట్.. శరీర పోషణలో అత్యంత ముఖ్యమైన పాత్ర అల్పాహారానిదే. చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. దాని వల్ల బరువు తగ్గుతామని ఫీల్ అవుతారు. కానీ అది వాస్తవం కాదు. అల్పాహారం మానెయ్యటం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుంటే పోషకాహార లోపం వస్తుంది
ముఖ్యంగా చిన్నపిల్లలు, యుక్తవయసులోని వారు బ్రేక్ ఫాస్ట్ చేయమంటే చెయ్యకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇడ్లీ, దోస, వడ, చపాతీ వంటి బ్రేక్ ఫాస్ట్ లను తినడానికి అసలే ఇష్టపడరు. ఇక ఉదయం బలవంతంగా బ్రేక్ ఫాస్ట్ చెయ్యమని చెప్తే నూడిల్స్ వంటివి చేసుకొని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం, ఇక అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం పోషకాహార లోపాన్ని తీసుకువస్తుందని, ఫలితంగా వారు తొందరగా అనారోగ్యం బారిన పడతారని చెబుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఈ రోగాలను ఆహ్వానించినట్టే
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల మనలో మెటబాలిజం బాగా తగ్గుతుందని, వ్యాధి నిరోధక శక్తి తగ్గితే అనారోగ్యం బారిన పడతామని చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో న్యూట్రిషన్ లోపాలు ఏర్పడతాయని చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారు నేరుగా భోజనం చేస్తే ఎక్కువ తినేస్తారని, ఫలితంగా అధిక బరువు పెరిగి ఒబేసిటీగా మారే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇక బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో గుండె సంబంధిత సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుంటే అన్నీ నష్టాలే
సరైన సమయంలో అల్పాహారం తీసుకోని వారిలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని, వారి మెదడు చురుకుదనం తగ్గుతుందని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో చాలా తక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని, వారు చాలా నీరసంగా కనిపిస్తారని చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వారిలో మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, సడన్ గా మూడ్ స్వింగ్స్ ఉంటాయని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో హార్మోనల్ సమస్యలు వచ్చి మైగ్రేన్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుంటే డయాబెటిస్ కు ఛాన్స్
బ్రేక్
ఫాస్ట్
స్కిప్
చేసే
వారు
మధుమేహం
బారిన
పడే
ప్రమాదం
కూడా
ఉందని
అంటున్నారు.
అల్పాహారం
తీసుకోని
వారిలో
జుట్టు
విపరీతంగా
ఊడిపోతుందని,
జుట్టుకు
సంబంధించిన
సమస్యలు
వస్తాయని
అంటున్నారు.
బ్రేక్
ఫాస్ట్
తీసుకోని
వారిలో
క్యాన్సర్
కూడా
వచ్చే
అవకాశం
ఉంటుందని
చెప్తున్నారు.
బ్రేక్
ఫాస్ట్
చెయ్యని
మహిళలలో
రుతుక్రమ
సమస్యలు
వస్తాయని
అంటున్నారు.
బ్రేక్
ఫాస్ట్
చెయ్యకుంటే
ఇన్ని
సమస్యలకు,
అనారోగ్యాలకు
ఆస్కారం
ఉంటుంది
కాబట్టి
కచ్చితంగా
బ్రేఫ్
ఫాస్ట్
చెయ్యాలని
సూచిస్తున్నారు.
అలా
అని
అతిగా
తినకూడదని
హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.