health tips: ఆరోగ్యం విషయంలో అతిగా చేసే పనులతో అనర్ధం.. మితం ఎప్పుడూ హితం!!
అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు. ఏదైనా అతిగా చేస్తే అది ప్రమాదమని చెబుతారు. ఇక ఈ విషయం అన్నింటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇది అందరూ తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు అది మంచిదే అయినా.. ఆరోగ్యం పట్ల అతి శ్రద్ధ చూపించటం ఏమాత్రం మంచిది కాదని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

అతిగా డైటింగ్... కొత్త అనారోగ్య సమస్యలు
ఉదాహరణకు ఊబకాయంతో బాధపడేవారు ఊబకాయం తగ్గడంకోసం డైటింగ్ చేస్తారు. ఇక ఈ డైటింగ్ మంచిదే అయినప్పటికీ అతిగా డైటింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అతిగా డైటింగ్ చేసేవారు సరైన ఆహారం తీసుకోకపోతే వారిలో పోషకాహారలోపం ఏర్పడుతుంది. పోషకాహార లోపం వల్ల వారు రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి అతిగా డైటింగ్ చేసి కొత్త సమస్యలను కొని తెచ్చుకుకోండా, నిపుణుల పర్యవేక్షణలో నిదానంగా బరువు తగ్గడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఒక్కసారిగా బరువు తగ్గితే కూడా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు.

అతిగా ఎక్సర్ సైజులు .. కండరాలకు కొత్త సమస్యలు
చాలామంది అతిగా ఎక్సర్సైజ్ లతో బరువు తగ్గాలని విపరీతమైన వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా మనకు తెలియకుండానే కొత్త సమస్యలకు కారణమవుతాయి. విపరీతంగా వర్కవుట్ చేయడం వల్ల కూడా కండరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైనా లిమిట్ లో చేసినప్పుడు దాని ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యంపై అవగాహన అవసరమే.. కానీ అతి మంచిది కాదు
ఆరోగ్యం పైన భయంకరమైన అవగాహన ఉండటం కూడా ఒకసారి ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు. కొంత మేరకు అవగాహన ఉండడం మంచిదే అయినా, మరీ ఎక్కువగా విపరీతంగా అవగాహన ఉండటం, వారిని రకరకాలుగా ఆందోళనకు గురి చేస్తోందని, అందుకే ఆరోగ్యం విషయంలో కూడా మరీ మునిగిపోయి ఉండకుండా తగినంత మేరకు శ్రద్ధ చూపించాలని సూచిస్తున్నారు.

అతి అనర్ధం.. మితం ఎప్పటికీ హితం
ఎప్పుడైనా అతి మంచిది కాదని , అతిగా తినడం, అతిగా వ్యాయామం చేయడం, మరీ అతిగా ప్రతి విషయంలో ఆరోగ్యం గురించి అనుమానాలు వ్యక్తం చేయడం కొత్త సమస్యలకు కారణమవుతాయి అని చెబుతున్నారు. అనర్ధాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఒక్కసారిగా అతిగా అన్నీ చేసి, ఆపై అన్నిటినీ లైట్ తీసుకుని వ్యాయామం మానేసి, అతిగా తిని, పట్టింపు లేకుండా తిరిగితే మరో కొత్తరకం సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఏదైనా మితంగా ఉంటే సమస్య ఉండదని, మితం దాటితేనే అన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మితం ఎప్పుడూ హితం అంటున్నారు.
disclaimer: ఈ కథనం యోగా నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications