వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: స్లిమ్‌గా ఉండాలని డైటింగ్ చేస్తున్న యువతులు.. ఈటింగ్ డిజార్డర్ వస్తుందంటున్న అధ్యయనాలు!!

|
Google Oneindia TeluguNews

యువత డైటింగ్ పేరుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా? విపరీతంగా బరువు పెరుగుతామనే ఆందోళనతో శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా తీసుకోవడం లేదా? సరైన వయసులో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల యువతలో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా ? పోషకాహార లోపంతో వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

health tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం అల్పాహారంలో ఈ మూడు పదార్థాలు ఉండేలా చూసుకోండి!!health tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం అల్పాహారంలో ఈ మూడు పదార్థాలు ఉండేలా చూసుకోండి!!

చిన్నవయసులో డైటింగ్.. ముఖ్యంగా అమ్మాయిలకు డేంజర్

చిన్నవయసులో డైటింగ్.. ముఖ్యంగా అమ్మాయిలకు డేంజర్


ప్రస్తుత కాలంలో ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరగకూడదనే ఉద్దేశంతో చిన్నప్పటి నుండే డైటింగ్ చేస్తూ ఉంటున్నారు. నూనె వస్తువులు తినకుండా, తినే ఆహారంలో కూడా సగానికి సగం తగ్గించేసి డైటింగ్ పేరుతో స్లిమ్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా తినకుండా కడుపు మాడ్చుకుంటున్నారు. అయితే యుక్తవయసులో ఉన్న యువత, ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరగకూడదనే ఆలోచనతో చిన్న వయసు నుండే డైటింగ్ చేస్తే దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలకు లోను కావలసి ఉంటుందని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. ఇది చాలా డేంజర్ అని చెప్తోంది.

చిన్న వయసులో డైటింగ్ చేస్తే ఈటింగ్ డిజార్డర్

చిన్న వయసులో డైటింగ్ చేస్తే ఈటింగ్ డిజార్డర్


ఇక డైటింగ్ దెబ్బతో వారు రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. 25 సంవత్సరాలు దాటేసరికి వారు ఏమీ తిన లేకపోవడం, లేదా ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుండటం వంటి ఈటింగ్ డిజార్డర్ సమస్యకు లోనవుతున్నారు అని చెబుతున్నారు. ఈటింగ్ డిజార్డర్ ఒక శారీరక సమస్యగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక సమస్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటింగ్ ప్రభావం మనసు పైన చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలినట్టు గా నిపుణులు వెల్లడించారు.

 అధికంగా బరువు పెరగకుండా చేసే డైటింగ్ పద్ధతులు ఏ మాత్రం మంచిది కావు

అధికంగా బరువు పెరగకుండా చేసే డైటింగ్ పద్ధతులు ఏ మాత్రం మంచిది కావు


ఇక డైటింగ్ ప్రభావంవల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది. డైటింగ్ చేస్తున్న అమ్మాయిలు వారు తమ శరీరానికి ఎంతో మేలు చేస్తున్నామని భావిస్తున్నప్పటికీ, వారు శరీరానికి ఎంతో హాని చేస్తున్నట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. శారీరకంగా ఉండవలసిన అంత బరువు ఉండటం కరెక్టే అయినప్పటికీ, అధికంగా బరువు పెరగకుండా చేసే డైటింగ్ పద్ధతులు ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. శారీరక శ్రమతో అధిక బరువును తగ్గించుకోవాలి తప్ప, డైటింగ్ పేరుతో పోషకాహార లోపానికి గురి కాకూడదని హెచ్చరిస్తున్నారు.

డైటింగ్ చెయ్యని వారి కంటే చేసే వారిలోనే ఈటింగ్ డిజార్డర్

డైటింగ్ చెయ్యని వారి కంటే చేసే వారిలోనే ఈటింగ్ డిజార్డర్


విపరీతంగా డైటింగ్ పేరుతో తినకుండా ఉండేవారు చాలా అలసటకు గురవుతారని, ఎక్కువ సమయం ఏ పనీ చెయ్యలేరని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండాలని, సమయానుకూలంగా సరైన ఆహారాన్ని యువత ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. డైటింగ్ చెయ్యని వారితో పోలిస్తే, డైటింగ్ చేసే యువతులలో ఎక్కువ మంది ఈటింగ్ డిజార్డర్ బారిన పడినట్లుగా అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.

శరీర పోషణ విషయంలో అమ్మాయిలు అవగాహన కలిగి ఉండాలి

శరీర పోషణ విషయంలో అమ్మాయిలు అవగాహన కలిగి ఉండాలి


కేవలం బరువు తగ్గడం కోసం చేసే ఈ ప్రక్రియ లోపభూయిష్టమైనదని పేర్కొన్న ఆహార నిపుణులు, ప్రతి ఒక్కరూ శరీర పోషణ ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపై అవగాహన కలిగి ఉండాలని, డైటింగ్ పేరుతో కడుపుని ఎండగట్టడం మంచిది కాదని సూచిస్తున్నారు. విపరీతమైన డైటింగ్ తో శరీరానికి హాని కలిగించకుండా, మెరుగైన జీవన శైలి విధానాలతో ఆరోగ్యంగా జీవించాలని సూచిస్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Young women who are doing dieting to be slim are in danger. Studies reveal that they develop an eating disorder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X