35 ఏళ్ల మహిళతో తాతయ్య పెళ్లి.. కానీ శోభనం తెల్లారే..
సాధారణంగా వయసు మీద పడుతుంటే తోడు కావాలని ఎవరైనా కోరుకుంటారు. వయసులో ఉన్నప్పుడు అన్నీ తామే చేసుకున్నవారు వృద్ధాప్యంలో తోడు కోసం పరితపిస్తారు. 75 ఏళ్ల ఆ వృద్ధుడు కూడా అలాగే ఆలోచించాడు. తన భార్య చనిపోవడంతో తోడు కావాలని కోరుకున్నాడు. భార్య లేని జీవితాన్ని గడపలేక రెండో పెళ్లి చేసుకున్నాడు. 35 ఏళ్ల మహిళను పెళ్లాడారు. కానీ ఆయన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. శోభనం తెల్లారే ఆ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ జౌన్ పుర్ జిల్లా కుచ్ ముచ్ అనే గ్రామంలో జరిగింది.
ఈ గ్రామానికి చెందిన సంగూరామ్ వయసు 75 సంవత్సరాలు. ఆయన తనకంటే సగం వయసు తక్కువున్న అంటే 35 ఏళ్ల మహిళను పెళ్లాడాడు. తన మొదటి భార్య చనిపోవడంతో వృద్ధాప్యంలో తోడు కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నాడు. సంవత్సరం క్రితం తన మొదటి భార్యను కోల్పోయాడు సంగూరామ్. అయితే కొన్ని నెలలపాటు ఒంటరి జీవితం అనుభవించాడు. వృద్ధాప్యం అన్ని పనులు చేసుకోనని భావించి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతనికి పిల్లలు లేరు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే భార్య చనిపోయాక సంగూరామ్ రెండో పెళ్లి చేసుకొంటానని బంధువులకు చెప్పడంతో వాళ్లు వద్దని వారించారు. అయినా సంగూరామ్ వారి మాట వినలేదు. సెప్టెంబర్ 29న జలాల్ పుర్ ప్రాంతానికి చెందిన మాన్ భవతి అనే 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. దంపతులిద్దరూ తమ వివాహాన్ని కోర్టులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లిరోజు అర్ధరాత్రి వరకూ దంపతులిద్దరూ మాట్లాడుకున్నారు. తెల్లారి సంగూరామ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడ్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంగూరామ్ ది సహజ మరణం అని కొందరు భావిస్తుండగా.. మరికొంత మంది మాత్రం అనుమానాస్పద మృతిగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications