పాఠశాలలకు సెలవు.. భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం

తమిళనాడును భారీ వర్షాలు వీడడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వానలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు పలు ప్రాంతాలు నీటమునిగాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నైతో పాటు, తిరువళ్లూర్, వెల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మయిలాడుతురై, తంజావూరు, రామనాథపురం, దిండిగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.భారీ వర్షాలు కురుస్తున్న నేథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకల్ లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ముందుస్తు చర్యలు చేపట్టాలని , లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచింది. ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు అందించాలని జిల్లా అధికారయంత్రానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.

అటు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. తిరువల్లూరు, చెగలపట్టు, కాంచీపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని అంచనా వేసింది. ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, రాష్ట్ర అత్యవసర బృందాలు అప్రమత్తమైయ్యారు. ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు ఈనెల 13 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.. నివాసితులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తమిళనాడులో భారీ వర్షాలు కురవడం ఈ ఏడాది ఇదే తొలిసారి కాదు. నవంబర్‌లో కడలూరు , తిరువారూర్, నాగపట్నం, చెన్నె, మైలదుతురై జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+