నాలుగు రోజుల కాపురం.. లక్షల భరణం?: High Court
వివాహం కంటే ముందే విడాకుల మాటలు, కాపురం మొదలకముందే భరణం డిమాండ్లు... ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌కుహైకోర్టు ఘాటు సందేశం ఇచ్చింది. "సరైన కారణం లేకుండా భర్తను వదిలి వెళ్లే భార్యకు భరణం అడగడానికి హక్కు ఉండదు" అని స్పష్టంగా తేల్చిచెప్పింది. భరణం అనేది ఆటోమేటిక్ హక్కు కాదని, కేవలం పెళ్లి బంధమే ఆధారం కాదని, భార్య ప్రవర్తన కూడా కీలకమే అని న్యాయస్థానం తేల్చింది.
ఈ కేసు వివరాలు కోర్టును కూడా ఆలోచింపజేశాయి. వివాహం జరిగిన నాలుగు రోజులకే మహిళ తన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక, శారీరక హింస ఆరోపణలు చేసింది. అత్తమామలు రూ.10 లక్షలు నగదు, కారు డిమాండ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద భరణం కోరుతూ ఛత్తీస్‌గఢ్ హై కోర్టును ఆశ్రయించింది.

'నేను కాపురానికి సిద్ధం' అన్న భర్త
అయితే, భర్త మాత్రం స్పష్టంగా ఒక మాట చెప్పాడు. "నేను భార్యతో కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని న్యాయస్థానానికి తెలియజేశాడు. ఈ అంశాన్ని పరిశీలించిన బిలాస్‌పూర్ ఫ్యామిలీ కోర్టు, భార్య అభ్యర్థనలో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ భరణం ఇవ్వడానికి నిరాకరించింది.
కారణం లేకుంటే హక్కు లేదు
ఫ్యామిలీ కోర్టు తీర్పును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పూర్తిగా సమర్థించింది. భార్య తన భర్త నుంచి విడిగా జీవించడానికి చట్టబద్ధమైన, సహేతుకమైన కారణాలు చూపలేకపోయిందని ధర్మాసనం పేర్కొంది. భర్త సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా, భార్య స్వచ్ఛందంగా అత్తింటిని వదిలి వెళ్లి తిరిగి రావడానికి నిరాకరిస్తే, ఆమె భరణానికి అర్హురాలు కాదని స్పష్టం చేసింది.
సెక్షన్ 125పై కీలక వ్యాఖ్యలు
సీఆర్పీసీ 125 సెక్షన్‌ను ఉదహరిస్తూ, "తగిన కారణం లేకుండా విడిగా నివసించే భార్యకు భరణం ఇవ్వకూడదని చట్టమే చెబుతోంది" అని హైకోర్టు గుర్తు చేసింది. భరణం అనేది నిజంగా బాధితులైన, క్రూరత్వానికి గురైన మహిళలను రక్షించడానికి ఉద్దేశించిందే కానీ, విడిపోవడానికి సరైన న్యాయ కారణం లేకుండా వాడుకునే ఆయుధం కాదని వ్యాఖ్యానించింది.
సమాజానికి స్పష్టమైన సంకేతం
ఈ తీర్పుతో న్యాయస్థానం ఒక స్పష్టమైన గీత గీసింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన.. లేదా ఆరోపణలు చేసినంత మాత్రాన భరణం హక్కు రావడం లేదు అనే సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలకు ఇది ఒక గట్టి హెచ్చరికగా న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications