ఏడుపులు , రోదనలు : హైడ్రామాతో దద్దరిల్లిన ఎస్‌పి ఆఫీస్
పార్టీ నుండి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆరేళ్ళపాటు బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ములాయం సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం ఎదుట హైడ్రామా కొనసాగుతోంది. పార్టీ నుండి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆరేళ్ళ పాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
పార్టీ ప్రకటించిన జాబితాకు విరుద్దంగా పోటీజాబితాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడం పట్ల ఆగ్రహంతో సమాజ్ వాదీ పార్టీ చీప్ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ను ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరించారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అఖిలేష్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

పార్టీ చీప్ ములాయం సింగ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తండ్రీ కొడుకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో యూపీ రాజకీయాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. ఎస్పీ కార్యాలయ ప్రాంగణం ఏడుపులు, రోదనలతో దద్దరిల్లుతోంది. మద్దతుదారుల ఆందోళనతో ఎస్పీ కార్యాలయం ఎదుట హైడ్రామా నడుస్తోంది. అఖిలేష్ ను భుజాలపై ఎత్తుకుని ఆయన అభిమానులు కార్యాలయం ఎదుట ఊరేగించడం గమనార్హం. భవిష్యత్తు కార్యాచరణపై అఖిలేష్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే పార్టీ లో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కన్పిస్తోంది. శివపాల్ యాదవ్, ములాయం సింగ్ వర్గం ఓ వైపు, అఖిలేష్ యాదవ్ వర్గం మరో వైపుగా నిలిచింది. యువనాయకత్వం ఎక్కువగా అఖిలేష్ యాదవ్ ను సపోర్ట్ చేస్తున్నారు.
మరోవైపు నోటీసు ఇచ్చిన ఆరు గంటల్లోనే ఎలా బహిష్కరిస్తారంటూ రాంగోపాల్ యాదవ్ ములాయంను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications