Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1

ఇవాళ కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే దశలో జరిగిన పోలింగ్ లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో ఈ మూడు చోట్ల కూడా భారీ పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాల్ని (voter turnout) ఈసీ ప్రకటించింది. ఇందులో పుదుచ్చేరి భారీ పోలింగ్ శాతం నమోదు చేసుకోగా.. అస్కాం, కేరళలోనూ పలు రికార్డులు నమోదయ్యాయి.

పుదుచ్చేరిలో అత్యధికంగా 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత అస్సాంలో 84.42 శాతం పోలింగ్ , కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 84.42 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. ఇది 2021 ఎన్నికల్లో నమోదైన 82.04 శాతం పోలింగ్‌ను దాటేసింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది.

High voter turnout in Puducherry kerala and assam assembly elections-here are poll percentages

అలాగే కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 74.06 శాతం పోలింగ్ కంటే స్వల్పంగా ఎక్కువ. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. గడువుకు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను క్యూలలో వేచి ఉండి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతించారు. ఇక్కడ ప్రాథమిక అంచనాల ప్రకారం పోలింగ్ శాతం 86 శాతానికి పైగా నమోదైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+