Hijab: హైకోర్టు చెప్పినా మామూలే, గేట్ లోనే హిజాబ్ లు తీపించిన పోలీసులు, ఇంటికి రిటన్ !
బెంగళూరు: ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజ్ లతో పాటు విద్యాసంస్థల్లో ఎవ్వరూ హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకోకూడదని కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వచ్చే వరకు అందరూ హిజాబ్ లు, కాషాయం కండువాలకు దూరంగా ఉండాలని ఇటీవల కర్ణాటక హైకోర్టు మద్యంతర అదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో సోమవారం 1 నుంచి 10వ తరగతి వరకు స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా ఉర్దూ స్కూల్ లో హిజాబ్ లు వేసుకుని అమ్మాయిలు స్కూల్ కు రావడం హాట్ టాపిక్ అయ్యింది. విషయం గుర్తించిన స్కూల్ హెడ్ మాస్టర్, ఎస్ డీఎంసీ పదాదికారులు అమ్మాయిల దగ్గర హిజాబ్ లు తీపించేశారు. అయితే హిజాబ్ లు తియ్యడానికి అంగీకరించని అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులు స్కూల్ నుంచి ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు. హైకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటిస్తేనే స్కూల్స్ లోకి విద్యార్థులను అనుమతి ఇస్తామని స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాద్యాయులు అంటున్నారు.
Recommended Video

హైకోర్టు ఆదేశాలు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకునే విషయం ముదిరిపోవడంతో ఈ వివాదం పిటిషన్ల విచారణ హైకోర్టులో ఉంది. ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజ్ లతో పాటు విద్యాసంస్థల్లో ఎవ్వరూ హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకోకూడదని కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వచ్చే వరకు అందరూ హిజాబ్ లు, కాషాయం కండువాలకు దూరంగా ఉండాలని ఇటీవల కర్ణాటక హైకోర్టు మద్యంతర అదేశాలు జారీ చేసింది.

బెంగళూరు శివార్లలో ఉర్దూ స్కూల్
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని సూలిబెలెలో ప్రభుత్వ ఉర్దూ స్కూల్ ఉంది, సోమవారం ఉర్దూ స్కూల్ కూడా ప్రారంభం అయ్యింది. స్కూల్ కు వచ్చే అమ్మాయిలు ఎవ్వరూ హిజాబ్ లు వేసుకుని రాకూడాదని అంతకు ముందే స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థుల కుటుంబ సభ్యులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా సమచారం ఇచ్చారు.

వీడియో కాన్పరెన్స్ లో ముందుగానే చెప్పిన హెడ్ మాస్టర్
హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, ఎవ్వరూ కూడా హిజాబ్ లు వేసుకుని రాకూడదని ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థులకు మనవి చేశారు. అయితే ఉర్దూ స్కూల్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని స్కూల్ దగ్గరకు వెళ్లారు. విషయం గమనించిన విద్యాశాఖ అధికారులు, పోలీసులు షాక్ అయ్యారు.

గేట్ లోనే విద్యార్థుల దగ్గరే వారి హిజాబ్ లు తీపించేశారు
హైకోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా ఉర్దూ స్కూల్ లో హిజాబ్ లు వేసుకుని అమ్మాయిలు స్కూల్ కు రావడం హాట్ టాపిక్ అయ్యింది. విషయం గుర్తించిన స్కూల్ హెడ్ మాస్టర్, విద్యాశాఖా అధికారి ఎన్ఎం. ఆశా, సబ్ ఇన్స్ పెక్టర్ రమేష్, సీఆర్ పీ మంజునాథ్, ఎస్ డీఎం సీ పదాదికారులు అమ్మాయిల దగ్గర హిజాబ్ లు తీపించేశారు.

వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయిలు
అయితే హిజాబ్ లు తియ్యడానికి అంగీకరించని అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులు స్కూల్ నుంచి ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు. హైకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటిస్తేనే స్కూల్స్ లోకి విద్యార్థులను అనుమతి ఇస్తామని స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాద్యాయులు అంటున్నారు. కర్ణాటకలో సోమవారం 1 నుంచి 10వ తరగతి వరకు స్కూల్స్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications