Hijab: హిజాబ్ వివాదం, మళ్లీ విచారణ వాయిదా, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు, లాయర్లకు !

బెంగళూరు: హిజాబ్ వివాదంపై గురువారం కూడా కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ వివాదం అడ్డం పెట్టుకుని పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్లు వేసి వాదనలు వినిపించడానికి సిద్దం అయ్యారు. ఇన్ని రోజులు హిజాబ్ దరించే విషయంలో న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే హిజాబ్ వివాదంలో మళ్లీమళ్లీ అదే వాదనలు వినిపించడానికి కొందరు న్యాయవాదులు సిద్దం అయ్యారని తెలిసంది. ప్రముఖ న్యాయవాది, సమాజ సేవకుడు రహమత్ ఉల్లా సమర్పించిన పిల్ విచారణను తిరస్కరించిన హైకోర్టు మరోసారి సరైన పద్దతిలో పిల్ సమర్పించాలని సూచించింది. హిజాబ్ ను నిషేదిస్తే ఖురాన్ నిఫేదించినట్లే అని మరో న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. మరో న్యాయవాది అయితే హిజాబ్ లు లేకుండా కాలేజ్ కు వెళ్లడం సాధ్యం కాదని కోర్టులో వాదించారు. మీరు ఏ కాలేజ్ లో, ఏమి చదువుతున్నారు ? అంటూ హైకోర్టు ప్రశ్నించడంతో ఆ న్యాయవాది కంగుతిన్నారు. ప్రభుత్వం తరపున శుక్రవారం వాదనలు వినిపిస్తామని, అందుకు అవకాశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు మనవి చేశారు. ప్రభుత్వం ఏమైనా నియమాలలో మార్పులు చెయ్యాలని ఆలోచిస్తుంటే మీరు ముందుగా అర్జీ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ కూ సూచించింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది.

హిజాబ్ వివాదంపై వాదనలు

హిజాబ్ వివాదంపై వాదనలు


హిజాబ్ వివాదంపై గురువారం కూడా కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ వివాదం అడ్డం పెట్టుకుని పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్లు వేసి వాదనలు వినిపించడానికి సిద్దం అయ్యారు. ఇన్ని రోజులు హిజాబ్ దరించే విషయంలో న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే హిజాబ్ వివాదంలో మళ్లీమళ్లీ అదే వాదనలు వినిపించడానికి కొందరు న్యాయవాదులు సిద్దం అయ్యారు.

అర్జీ విచారణ తిరస్కరించిన హైకోర్టు

అర్జీ విచారణ తిరస్కరించిన హైకోర్టు

ప్రముఖ న్యాయవాది, సమాజ సేవకుడు రహమత్ ఉల్లా సమర్పించిన పిల్ విచారణను తిరస్కరించిన హైకోర్టు మరోసారి సరైన పద్దతిలో పిల్ సమర్పించాలని సూచించింది. పలు విషయాలను అర్జీలో తప్పుగా పొందు పరిచి కోర్టు సమయానికి వృధా చేస్తున్నారా అంటూ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ న్యాయవాది రహమత్ ఉల్లాను ప్రశ్నించారు. న్యాయవాది రహమత్ ఉల్లాతో పాటు ఇప్పటికే కొందరు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది శదాద్ కూడా ఆయన వాదనలు వినిపించారు.

లింక్ లేకుండా మాట్లాడుతున్నారా ?

లింక్ లేకుండా మాట్లాడుతున్నారా ?


మరో పిల్ దాఖలు చేసిన న్యాయవాది వినోద్ కులకర్ణి ఆయన వాదనలు వినిపించారు. శుక్రవారం స్కూల్స్, కాలేజ్ ల్లో చదువుతున్న అమ్మాయిలు హిజాబ్ లు దరించడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేశారు. ఒకసారి యూనీఫామ్ విషయంలో వాదిస్తున్నారు, మరో సారి హిజాబ్ విషయంలో మాట్లాడుతున్నారు, మీ రెండు వాదనలు విరుద్దుంగా ఉన్నాయని హైకోర్టు సీజేఐ న్యాయవాదిని ప్రశ్నిస్తున్నారు. ఖురాల్ లో ఎక్కడ హిజాబ్ గురించి రాశారు చెప్పండి అని హైకోర్టు ప్రశ్నించడంతో తన దగ్గర ప్రస్తుతం ఖురాన్ లేదని వినోద్ కులకర్ణి చెప్పారు, అయితే పిటిషన్ లో ఖురాన్ విషయం ఎందుకు ప్రస్తావించారు అంటూ హైకోర్టు న్యాయవాది వినోద్ కులకర్ణిని ప్రశ్నించింది.

మీరు ఏ కాలేజ్ లో చదువుతున్నారు ? లాయర్ కు సూటి ప్రశ్న

మీరు ఏ కాలేజ్ లో చదువుతున్నారు ? లాయర్ కు సూటి ప్రశ్న

మరో న్యాయవాది ఏఎం ధర్ వాదనలు వినిపిస్తూ హిజాబ్ లు లేకుండా కాలేజ్ కు వెళ్లడం సాధ్యం కావడంలేదని, కచ్చితంగా హిజాబ్ లు దరించి విద్యాసంస్థలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేశారు. మీరు ఏ కాలేజ్ లో, ఏమి చదువుతున్నారు ?, ఈ విషమం అర్జీలో పొందుపరిచారా ? అంటూ హైకోర్టు ప్రశ్నించడంతో న్యాయవాది ఏఎం, ధర్ కంగుతిన్నారు.

 టైమ్ ఇవ్వాలని మనవి చేసిన ఏజే

టైమ్ ఇవ్వాలని మనవి చేసిన ఏజే

కర్ణాటక ప్రభుత్వం తరపున శుక్రవారం వాదనలు వినిపిస్తామని, అందుకు అవకాశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ హైకోర్టుకు మనవి చేశారు. ప్రభుత్వం ఏమైనా నియమాలలో మార్పులు చెయ్యాలని ఆలోచిస్తుంటే మీరు ముందుగా అర్జీ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ ప్రభులింగకు సూచించింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ కర్ణాటక హైకోర్టు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+