హిమాచల్ ప్రదేశ్ లో 13.72 శాతం పోలింగ్: ఓటు వేసిన ప్రముఖలు, బీజేపీ, కాంగ్రెస్ ధీమా !

Posted By:
Subscribe to Oneindia Telugu
  Himachal Pradesh Assembly Elections 2017 Updates | Oneindia Telugu

  సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో గురువారం (నవంబర్ 9) శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రారంభం అయిన తరువాత ఇప్పటి వరకూ 13.72 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి వీరభద్రసింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిమ్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో వీరభద్రసింగ్, ఆయన కుమారుడు విక్రమాదిత్య తదితర కుటుంబ సభ్యులు వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

  Himachal Pradesh polls 2017: Votiog underway in 68 constituences

  ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ చెప్పారు.

  బీజేపీ సీఎం అభవ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమాల్ హమీర్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాంపూర్ లో ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రేమ్ కుమార్ ధూమాల్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.

  హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల సందర్బంగా మొత్తం 68 శాసన సభ నియోజక వర్గాల్లో 17, 850 మంది పోలీసులు, హోం గార్డులు, 65 కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. కిన్నోర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్ కు ఆలస్యం అయ్యింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Voting underway in the hill state of Himachal Pradesh in 68 constituencies where 337 candidates including 62 MLAs are in the fray. A total of 50,25,941 voters are eligible to cast their vote.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి