సంక్షోభం దిశగా హిమాచల్..ప్రభుత్వంపై ప్రజాగ్రహం..!!
హిమాచల్ ప్రదేశ్‌లోని సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. దీనికి కారణం ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను నేరవేర్చకపోవడం ఒకటైతే పాలనపై పట్టు కోల్పోవడం మరో కారణంగా కనిపిస్తోంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు నడిపిస్తారన్న నమ్మకం ఒకప్పుడు సుఖు నాయకత్వంపై కలిగినప్పటికీ, వరుస ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలో వనరులను అభివృద్ధి చేయడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, హిమాచల్ ప్రదేశ్‌ను ఆర్థిక పరిపుష్టిగల రాష్ట్రంగా తీర్చి దిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వాస్తవానికి ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడం, దాన్ని నెరవేర్చకపోవడమే సుఖ్విందర్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోంది. ఎన్నికల వేళ నాడు ప్రచారాస్త్రంగా నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ ప్రయోగించింది . ఇప్పటికీ నిరుద్యోగ భృతి అర్థవంతమైన పద్దతిలో కార్యరూపం దాల్చలేదు.అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ,పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామన్న మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. అసలు ఈ హామీలపై ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో హిమాచల్ ప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలనపై పట్టు లేకపోవడం
ఇక కీలకమైన హామీలు సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం కావడంతో పాటు, పాలనపై కూడా పట్టు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.అత్యవసర సేవలు అయిన ఆరోగ్య రంగం, విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు కోల్పోయింది. అక్కడి హాస్పిటల్స్‌లో కనీస వసతులు లేదా సదుపాయాలు కరువయ్యాయి.ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అయితే టీచర్ల కొరత కనిపిస్తోంది. కావాల్సిన వనరులు కూడా సరిగ్గా లేవు.ఇక సమర్థవంతమైన బ్యూరోక్రాట్లు కూడా లేకపోవడంతో పాలన గాలికొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇక సంక్షోభం వస్తుందని తెలిసినా నివారణ చర్యలు తీసుకోకపోవడం, సంక్షోభం వచ్చాక ఏం చేయాలో తెలియకపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు విమర్శల పాలవుతున్నారు.
సిమ్లాలో మసీదుల నిర్మాణంతో...
సిమ్లాలో ఎక్కువ మసీదులు నిర్మించడంతో అక్కడ మతమార్పిడిలు కూడా క్రమంగా పెరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వంపై మరింత అసంతృప్తి కలిగేలా కారణమైంది. ఇటీవలే ఓ మసీదు వెలుపల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మసీదు నిర్మాణం అక్రమమని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కళ్లులేని కబోదిలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అంతేకాదు ఘన చరిత్ర ఉన్న సిమ్లా నగరానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.
అయినప్పటికీ సిమ్లా ప్రజల్లో మాత్రం ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో ప్రభత్వం విఫలమైందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.జరుగుతున్న ఈ పరిణామాలతో సిమ్లా నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.దీర్ఘకాలంగా ప్రశాంతంగా ఉన్న సిమ్లా నగరంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి.
కీలక అంశంపై చర్చ..సీఎం అసెంబ్లీలో కునుకు
ఓ వైపు అసెంబ్లీలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతుండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కునుకు తీస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఇంత పరధ్యానంతో వ్యవహరించిన సుఖుపై తీవ్ర స్థాయిలో ప్రజలు విరుచుకుపడుతున్నారు.ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా సరిగ్గా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో సైతం అసంతృప్తి తారాస్థాయికి చేరింది. కొన్ని నెలలుగా ప్రభుత్వ టీచర్లు, హెల్త్ వర్కర్లు,ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతం అందలేదు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో సుఖు ప్రభుత్వం విఫలంకావడంతో పాలనపై పట్టు కోల్పోయారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది.
హిమాచల్‌లో పెరుగుతోన్న డ్రగ్స్
సుఖు ప్రభుత్వ హయాంలో ఆందోళనకరంగా పరిణమించిన మరో అంశం డ్రగ్స్. డ్రగ్స్ ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన ప్రకృతి, పర్యాటక రంగానికి పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రం డ్రగ్స్‌కు నెలవుగా మారింది.అక్కడి యువత ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో క్రిమినల్ కార్యకలాపాలు కూడా సమాంతరంగా పెరిగాయి. కులు, మనాలి, మండి లాంటి ప్రాంతాల్లో అక్రమ డ్రగ్స్ రవాణ యదేచ్చగా సాగుతోంది. డ్రగ్స్ సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో సుఖు ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా కనిపిస్తోంది.రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని అణగదొక్కేందుకు కఠిన చట్టాలు తీసుకురావడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అంతే కాదు సరైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కూడా విఫలమైంది. రాష్ట్రంలో యువతరం డ్రగ్స్ వైపు మొగ్గడం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసేలా ఉంది.
చివరిగా...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు విఫలమయ్యారని చాలామంది అభిప్రాయంగా ఉంది.తన పాలనపై పట్టు కోల్పోయారనే విమర్శ ఉంది.ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మరింత అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కడం, అక్రమ నిర్మాణాలను అరికట్టడం,పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం,ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింకచకపోవడం వంటి అంశాలు ప్రజల్లో సుఖ్విందర్ సింగ్ సుఖు పాలనపై అసంతృప్తి పెరిగేలా చేశాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో యువత కన్న కలలు సాకారం కావడం లేదనే విమర్శ ఉంది. ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన సరిగ్గా లేదనే స్పష్టమైన సంకేతాలు వెళుతున్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications