'దేశంలో హిందూవుల జనాభా తగ్గింది', కారణమదేనా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలను మానుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజూ హితవు పలికారు.
న్యూఢిల్లీ:దేశంలో హిందూవుల జనాభా తగ్గుతోందని, హిందువులు మత మార్పిడి అయినవారు కాదని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజూ చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కూడ ఆ పార్టీయే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి ఆరోపణలు గుప్పించారు. ఇరుగు పొరుగు దేశాలతో పోలిస్తే దేశంలో మైనార్టీలు సురక్షితంగానే ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు.

పొరుగు దేశాల్లో అభద్రతగా మైనార్టీలు ఉంటారని చెప్పారు. శరణార్థులుగా భారత్ కు చాలా మంది వస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
భారత్ లౌకిక దేశమన్నారు.అన్ని మతాల ప్రజలు ప్రశాంతంగా స్వేఛ్చగా జీవిస్తున్నారని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలను మానుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications