భారత చరిత్రలోనే బాహుబలి డీల్..! 3.25 లక్షల కోట్లతో 114 రఫేల్స్..!

3.25 లక్షల కోట్లతో మన దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కేంద్రం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.

గతేడాది రక్షణ పరంగా ఎదురైన సవాళ్ల నేపథ్యంలో భారత్ (india) తమ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగ కొనుగోలుకు సిద్ధమైంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న యుద్ద విమానాలకు తోడు భారీ ఎత్తున కొత్త యుద్ద విమానాలను తమ అమ్ములపొదిలోకి చేర్చుకునేందుకు వీలుగా కీలక ఒప్పందం కుదుర్చుబోతోంది. దీన్ని చరిత్రలోనే బాహుబలి డీల్ గా రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ డీల్ భారత రక్షణ రంగానికి మేలి మలుపు కాబోతోంది.

బాహుబలి డీల్ (india)

భారత వైమానిక దళం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ల కొ నుగోలు కోసం ఫ్రాన్స్ తో ఏకంగా రూ.3.25 లక్షల కోట్ల ఖర్చుతో 114 ఫ్రెంచ్ రఫేల్ (rafale fighter jets) యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్దమవుతోంది. ఈ ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారం ఆమోదం తెలపబోతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఢిల్లీ పర్యటన వేళ ఈ ఒప్పందం జరగబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ఆమోదం పొందితే, దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా నిలవబోతోంది.

Historic Arms Deal India Set to Acquire 114 Rafale Fighter Jets for 3 25 Lakh Crore

3.25 లక్షల కోట్లతో 114 విమానాలు

ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే మొత్తం 114 రాఫెల్ యుద్ధ విమానాల్లో సుమారు 100 విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసేలా షరతు పెడుతున్నారు. దీంతో అత్యాధునిక ఫైటర్ జెట్లను, దేశీయంగా తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం జరగనుంది. అలాగే ఫ్రాన్స్ యేతర దేశాలలో రఫేల్ విమానాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలవనుంది. రెండు ఇంజిన్‌లతో కూడిన, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బహుళార్ధసాధక యుద్ధ విమానం రఫేల్. కచ్చితమైన దాడులు చేయడంలో రఫేల్ కు మంచి రికార్డు ఉంది.

Historic Arms Deal India Set to Acquire 114 Rafale Fighter Jets for 3 25 Lakh Crore

ఇప్పటికే మన అమ్ములపొదిలో..

ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పటికే 36 రఫేల్ విమానాలు ఉన్నాయి. ఇందులో చివరిదశైన సీ వేరియంట్ 2024 డిసెంబర్ లో ఫ్రాన్స్ మనకు ఇచ్చింది. అప్పట్లో రూ.63,000 కోట్ల ఒప్పందం కింద నేవీ కోసం 26 'ఎం' వెర్షన్ రఫేల్ విమానాలకు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈ డీల్‌లో నాలుగు రెండు-సీట్ల శిక్షణ విమానాలు, అలాగే MRO (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) ఒప్పందం కింద విమానాల నిర్వహణ, లాజిస్టిక్స్, సిబ్బంది శిక్షణ ఉన్నాయి. వీటి డెలివరీ 2030కు జరగనుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న రఫేల్ విమానాల్ని చివరి సారిగా ఆపరేషన్ సింధూర్ లో వాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+