Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్లకు బిగ్ షాక్.. అన్ని రాష్ట్రాలకు బిగ్ విక్టరీ.. సుప్రీం సంచలన తీర్పు

మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో కూడినదే రాష్ట్ర అసెంబ్లీ. వాళ్లు ఆమోదించిన బిల్లులను రాజ్యాంగబద్ధంగా ఆమోదించాల్సిన గవర్నర్లు.. రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటనే నిదర్శనం వివరాల్లోకి వెళితే.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్ ఎన్ రవికుమార్‌ ఆమోదించకుండా పక్కన పెట్టడాన్ని తప్పుబట్టింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నిరవధికంగా ఆ బిల్లులను పెండింగ్ లో పెట్టే హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గవర్నర్ తీసుకునే అన్ని చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

" తమిళనాడు గవర్నర్‌ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తప్పుబడుతున్నాం" అని జస్టిస్‌ జె.బి.పర్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని ఈ మేరకు ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ తిరస్కరించిన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ మరోసారి ఆమోదించి పంపించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని తెలిపింది.

మరోవైపు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభివర్ణించారు. తమ న్యాయపోరాటం దేశానికి వెలుగు చూపిందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో అసలు గవర్నర్ విధులు ఏంటి..? ఆర్టికల్ 200 ఏంటి..?

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు నానాటికీ వివాదాస్పదం అవుతోంది. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. గతంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, అప్పటి గవర్నర్ తో ఢీ అంటే ఢీ అన్నారు. బెంగాల్ తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు చెలరేగాయి. గతంలో తెలంగాణలోనూ కేసీఆర్, తమిళిసై సౌందర్‌రాజన్ మధ్య విబేధాలు వచ్చాయి. ఒకరి సమావేశానికి మరొకరు హాజరయ్యే వారు కాదు. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలి? గవర్నర్ అధికారాల గురించి రాజ్యాంగం ఏం చెప్పింది?

రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో నిజమైన కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలికి ఈ అధికారం ఉంటుంది. ప్రజలచే ఎన్నికోబడి, రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా నాయకులు ఉంటారు. ఇక ఆర్టికల్ 163 ప్రకారం.. గవర్నర్ మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరిస్తారు.

గవర్నర్ అధికారాలు

గవర్నర్‌ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలన్నీ గవర్నర్‌ పేరు మీదే జరుగుతాయి. రాష్ట్రానికి ప్రథమ పౌరులు. సందర్భానుసారం రాజ్యాంగపరంగా అధికారాలను వినియోగిస్తారు. అయితే గవర్నర్ లకు రాజ్యాంగం పలురకాల అధికారాలను అప్పగించింది.

రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం, వాయిదా వేయడం, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం లాంటి విధులను నిర్వహిస్తారు. పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగే విధంగా పర్యవేక్షిస్తారు. మంత్రిమండలి సలహా మేరకు పాలన సాగిస్తారు. అవసరమైన సందర్భాల్లో విచక్షణాధికారాలను వినియోగిస్తారు. పాలనా యంత్రాంగం విఫలమై రాష్ట్రపతి పాలన విధిస్తే వాస్తవ కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

గవర్నర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తారు. కేంద్రానికి రాష్ట్ర వ్యవహారాల గురించి తెలియజేస్తూ ఉంటారు. రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వం దాని నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నిర్ధారించడం వంటివి గవర్నర్ బాధ్యతలుగా ఉంటాయి.

అయితే, రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు ఉన్నాయి. శాసనసభ పంపిన సాధారణ బిల్లులను గవర్నర్‌ ఆమోదించవచ్చు. పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే పునఃపరిశీలన అనంతరం వచ్చిన బిల్లులను గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి గవర్నర్ కు విచక్షణాధికారం లేదు. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని భావిస్తేనే వాటిని గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. లేదంటే ఆమోదిస్తారు.

Historic Ruling Supreme Court Weighs in on Tamil Nadu Governor Controversy

మరోవైపు రాష్ట్ర స్థాయిలో బిల్లుల ఆమోదం విషయంలో అసెంబ్లీ, మండలి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేసే అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్ రాజ్యాంగ అధిపతి అయినప్పటికీ, ఎన్నికైన ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాల్లో ఏదైనా జోక్యం ఉన్నట్లు భావిస్తే అది ఘర్షణకు దారితీస్తుంది. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్‌ఆర్ రవి మధ్య ఇదే జరుగుతోంది.

ఆర్టికల్ 200 పై సుప్రీంకోర్టు ప్రస్తావన..

గవర్నర్ అధికారాల పరిధిని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ కేసులో సుప్రీంకోర్టు సూచించింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఏం చేయాలో? ఎలా వ్యవహరించాలో? తీర్పులో ప్రస్తావించింది. ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే వర్తించదని.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య సంబంధాలు రాజ్యాంగాన్ని పరిరక్షించడం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అనుసంధానంగా పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది.

Take a Poll

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+