HKU1 మళ్ళీ కరోనా టెన్షన్, కోల్ కత్తా మహిళకు కరోనా!

భారతదేశంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. కలకత్తాలోని ఓ మహిళ అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ హెచ్ కేయూ1 బారిన పడ్డారని తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని మళ్లీ ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం కలకత్తాలో HKU1 వైరస్ బారిన పడిన మహిళను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కోల్ కత్తాలో మహిళకు హ్యూమన్ కరోనా వైరస్
గత 15 రోజులుగా ఆ మహిళ జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం. 45 సంవత్సరాల వయసు ఉన్న ఈ మహిళ హ్యూమన్ కరోనా వైరస్ బారిన పడినట్టు ఆమెకు నిర్వహించిన టెస్టుల ఆధారంగా గుర్తించిన వైద్యులు దక్షిణ కోల్కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహిళ కోవిడ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కొనసాగుతుంది.

HKU1 Corona tension again Kolkata woman tests positive for Corona

HKU1 హ్యూమన్ కరోనా వైరస్ ఆందోళన
మళ్లీ కరోనా వ్యాప్తి జరుగుతుందా? మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తాయా? అని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయని, ఆ లక్షణాలు తీవ్రతరమయితే బ్రాంకైటిస్ కు, న్యుమోనియాకు దారితీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే సాధారణంగా తేలికపాటి శ్వాసకోశవ్యాధులతో HKU1 ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నారు.

ప్రికాషన్స్ ఇలా
ఇక కరోనా విషయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారో.. అటువంటి జాగ్రత్తలే హ్యూమన్ కరోనా విషయంలో కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యం అనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు మూసుకోవాలి అని, పరిసరాలు, వస్తువులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

వీరిపై తీవ్ర ప్రభావం
హ్యూమన్ కరోనా కార్డియో పల్మొనరీ వ్యాధి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైన చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అందుకే జాగ్రత్తలు పాటించి దాని నుండి కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+