జేమ్స్ బాండ్‌కు భారతీయ కంపెనీ చుక్కలు!
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ లకు.....విలన్లకు చుక్కలు చూపించే హాలివుడు నటుడు జేమ్స్ బాండ్ పాత్రను ధరించిన పియర్స్ బ్రస్నన్ కు ఓ ఇండియన్ కంపెనీ చుక్కలు చూపించింది.విలన్లు...అండర్ వరల్డ్ డాన్లకు సినిమాల్లో చుక్కుల చూపించిన జేమ్స్ బాండ్ హీరోకి ఇండియాకు చెందిన పాన్ మసాలా కంపెనీ చుక్కలు చూపించింది.
90 వ, దశకంలో జేమ్స్ బాండ్ పాత్రను ధరించి పేరొందిన హాలీవుడు నటుడు పియర్స్ బ్రాస్నన్ ఫోటో తో ఇండియాకు చెందిన పాన్ బహార్ అనే పాన్ మసాలా కంపెనీ తన ఉత్పత్తులను ప్రచారం చేసుకొంటుంది. పాన్ మసాల ఉత్పత్తుల ప్రచారానికి తన ఫోటోను వాడుకోవడం పట్ల ప్రియర్స్ బ్రాస్నన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఉపయోగపడే వస్తువులకు తాను ప్రచారం చేస్తానని....ప్రజలకు తీవ్రంగా నష్టం కల్గించే ఉత్పత్తుల ప్రచారాన్ని తాను వ్యతిరేకిస్తానని పియర్స్ చెప్పారు.పొగాకు వల్ల ఏ రకమైన ప్రమాదాలున్నాయో తనకు బాగా తెలుసునని చెప్పారు.పొగాకుతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని ఆయన గుర్తు చేశారు.ఈ భయంకరమైన వ్యాధితోనే తన మొదటి భార్యను, కూతురును కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
బ్రీత్ ప్రెష్నర్, పళ్ళకు సంబందించి ప్రచారం కోసం ప్రకటనలు చేశానని...పొగాకు లాంటి వ్యాధికారక ఉత్తత్తుల ప్రచారం కోసం తానెప్పుడూ ప్రచారం చేయలేదన్నారు. ఇండియా కంపెనీ పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం వాడుతున్న తన ఫోటోను వెంటనే తీసివేయాల్సిందిగా కోరతానని చెప్పారు. లేకపోతే అక్రమంగా తన పోటోను వాడుకొన్నందుకుగాను న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications