యుపిలో 9 మందిని బలి తీసుకున్న మద్యం
బారాబంకి (ఉత్తరప్రదేశ్): ఇంట్లో తయారు చేసిన మద్యం సేవించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో 9 మంది మరణించారు. మృతులు వివిధ గ్రామాలకు చెందినవారు
మంగళవారం రాత్రి వారంతా ఓ విందుకు హాజరయ్యారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత అస్వస్థతకు గురై మరణించారు. వారు సేవించింది కల్తీ మద్యమై ఉంటుందా, లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు ఇస్తామని జిల్లా యంత్రాంగం అంటోంది. కల్తీ మద్యం లేదా అక్రమ మద్యం సరఫరా చేసేవారికి మరణ శిక్ష విధించే చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. శాసనసభ ఆమోదించిన ఆ బిల్లుకు ఈ నెలలో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవిస్తే అందుకు కారణమైనవారికి మరణశిక్షను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మూడోది. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఆ చట్టం ఉంది.












Click it and Unblock the Notifications