అయ్యో.. పానీపురి కోసం వెళ్లిన విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మృగాళ్లా అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా మార్పు రావడం లేదు. ఆఖరికి పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కూడా విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా బెంగాల్ లో జరిగిన మరో షాకింగ్ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో బెంగాల్ లోని కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పటికీ సంచలనంగానే ఉంది. తాజాగా మానవ మృగాళ్ల చేతిలో మరో వైద్య విద్యార్థిని బలైంది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దుర్గాపుర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని జలేశ్వార్ కు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు కాలేజీ నుంచి బయటకు వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటల 30 అవుతోంది.
అయితే కొందరు అల్లరి మూకలు వాళ్లని వెంబడిస్తూ వేధించసాగాయి. యువతితో ఉన్న యువకుడిని పక్కకు నెట్టేసి.. యువతిని కాలేజీ వెనకాల ఉన్న అడవిలోకి లాక్కెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక బాధితురాలి మొబైల్ ఫోన్ లాక్కుని దూరంగా పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని ఫ్రెండ్ వెంటనే జరిగిన విషయం తన హాస్టల్ లోని స్టూడెంట్స్ కు చెప్పగా అందరు కలిసి బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందిన వెంటనే ఒడిషాలోని జలేశ్వార్ నుంచి బాధితురాలి పేరెంట్స్ వచ్చారు. తక్షణమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీలో సరైన భద్రతా చర్యలు లేవని మండిపడ్డారు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై దుర్గాపుర్ న్యూ టౌన్ షిప్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ లు చేయలేదని తెలిపారు.

ఇటీవల బెంగాల్ లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత సౌత్ కలకత్తాలో ఓ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు దుండగులు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications