Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hot Topic: డీసెంట్ భర్తలకు గుడ్ న్యూస్, భార్య టార్చర్ పెడితే కేసు పెట్టే చాన్స్, ఇలాంటి భార్యకు నోటీసు !

జమ్మూ కాశ్మీర్/ బెంగళూరు: నా మొగుడు తాగేసి వచ్చి నన్ను చితకబాదుతున్నాడు, నా మొగుడు వరకట్నం కోసం నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, నా మొగుడు అక్రమ సంబంధాలు పెట్టుకుని నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు, మద్యంకు బానిస అయిన నా మొగుడు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.... ఇలా దేశంలో అనేక చోట్ల భర్తల మీద భార్యలు గృహహింసల కేసులు పెట్టిన విషయం, ఇలాంటి కేసులు పెడుతున్న విషమం మనకు తెలిసింది. భర్తలో దెబ్బతో భార్యలు ఎలా చిత్రహింసలకు గురి అవుతున్నారో, కొందరు భార్యల దెబ్బతో భర్తలు కూడా టార్చర్ అనుభవిస్తున్నారని వెలుగు చూసినా అలాంటి కేసులు అరుదుగా బయటకు వస్తున్నాయి. భార్యల దెబ్బకు భర్తలు ఎలా విలవిలలాడిపోతుంటారో మనం కొన్ని కామిడీ సినిమాల్లో చూశాము.

అయితే కొందరు భార్యలు కూడా భర్తలను టార్చర్ పెడుతున్నారని, అలాంటి కేసులు కూడా నమోదు చెయ్యడానికి అవకాశం ఉందని కోర్టు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తన భార్య చిత్రహింసలకు గురి చేస్తోందని భర్త కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అతని భార్యకు నోటీసులు జారీ చేసింది. ఇంతకాలం భార్యలు పెట్టే చిత్రహింసలు తట్టుకుని విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని సైలెంట్ గా గూట్లో ఉంటున్న భర్తలు ఇప్పుడు అలాంటి భార్యల మీద కేసులు పెట్టడానికి అవకాశం వచ్చినట్లు అయ్యిందని న్యాయనిపుణులు అంటున్నారు.

 భర్తల మీద వేలల్లో చిత్రహింసల కేసులు

భర్తల మీద వేలల్లో చిత్రహింసల కేసులు

భర్తలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేలల్లో గృహహింసల చట్టం కింద కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కిరాతకులైన భర్తల చేతుల్లో అమాయకులైన భార్యల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విషయం మనం చాలానే చూస్తున్నాము.

 చిత్రవిచిత్రమైన కేసులు

చిత్రవిచిత్రమైన కేసులు

నా మొగుడు తాగేసి వచ్చి నన్ను చితకబాదుతున్నాడు, నా మొగుడు వరకట్నం కోసం నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, నా మొగుడు అక్రమ సంబంధాలు పెట్టుకుని నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు, మద్యంకు బానిస అయిన నా మొగుడు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు ఇలాంటి సంఘటనలతో దేశంలో అనేక చోట్ల భర్తల మీద భార్యలు గృహహింసల కేసులు పెట్టిన విషయం, ఇలాంటి కేసులు పెడుతున్న విషమం మనకు తెలిసింది.

 జమ్మూ కాశ్మీర్ లో రివర్స్ కేసు పెట్టిన భర్త

జమ్మూ కాశ్మీర్ లో రివర్స్ కేసు పెట్టిన భర్త

జమ్మూ కాశ్మీర్ లో ఓ సంఘటన జరిగింది. తన భార్య రోజూ ఇంట్లో తనను చిత్రహింసలకు గురి చేస్తోందని, ప్రతిరోజు నాకు నరకం చూపిస్తోందని, ఆ చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నానని, నాకు మీరే న్యాయం చెయ్యాలని ఓ భర్త జమ్మూ కాశ్మీర్ కోర్టును ఆశ్రయించాడు. జమ్మూ కాశ్మీర్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.

 భార్యల మీద భర్తలు కేసు పెట్టవచ్చు

భార్యల మీద భర్తలు కేసు పెట్టవచ్చు

కోర్టు దంపతుల ఇరు వైపుల వాదనలు వినింది. కొందరు భార్యలు కూడా భర్తలను టార్చర్ పెడుతున్నారని, అలాంటి కేసులు కూడా నమోదు చెయ్యడానికి అవకాశం ఉందని కోర్టు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తన భార్య చిత్రహింసలకు గురి చేస్తోందని భర్త కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం 2005 సెక్షన్ 12 చట్టం కింద అతని భార్యకు నోటీసులు జారీ చేసింది. భర్త తరపున న్యాయవాది మీనాక్షి సాథియా కోర్టులో వాదనలు వినిపించడం మరో హాట్ టాపిక్ అయ్యింది.

 సినిమాల్లో భర్తలను కొడుతుంటే పిచ్చ కామిడి

సినిమాల్లో భర్తలను కొడుతుంటే పిచ్చ కామిడి

భార్యల దెబ్బకు భర్తలు ఎలా విలవిలలాడిపోతుంటారో మనం కొన్ని కామిడీ సినిమాల్లో చూశాము. తెలుగు సినిమాల్లో ఎక్కువగా కామిడీ స్టార్స్ వాళ్ల భార్యల చేతుల్లో దెబ్బలు తినే సీన్ లు చాలానే వచ్చాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ నటించిన సినిమాలు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయాయి. కొందరు భార్యలు కూడా భర్తలను టార్చర్ పెడుతున్నారని, అలాంటి కేసులు కూడా నమోదు చెయ్యడానికి అవకాశం ఉందని కోర్టు చెప్పింది. మొత్తం మీద భార్యల కారణంగా చిత్రహింసలకు గురి అవుతున్న భర్తలకు ఈ కేసు ఇప్పుడు ఆయుధంలా మారే అవకాశం ఉందని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+