అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఇద్దరు పిల్లల తల్లిపై అత్యాచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సంతోష్‌పూర్‌లో గల ఓ అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఘోరం జరిగింది. 49 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లిపై ఓ వ్యక్తి బుధవారంనాడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అత్యాచారానికి పాల్పడిన ఎలక్ట్రీషియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన ఎలక్ట్రీషియన్ ప్రదేశ్ సూర్ అలియాస్ విక్రమ్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
అందుకు అతనిలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. పోలీసులు అతన్ని గురువారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో అతనిలో ఏ విధమైన ఆవేదన కనిపించలేదు.

బాధితురాలి పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కాలేజీలో చదువుతున్నాడు. ఎలక్ట్రిక్ వైర్లను మార్చే పనిలో విక్రమ్‌తో పాటు మరొకతను కొద్దిరోజులుగా మునిగిపోయారు. దాంతో కుటుంబ సభ్యుల కదలికలను అతను గమనించినట్లు అర్థమవుతోంది.
పిల్లలు, భర్త సాయంత్రానికి గానీ రాడని గుర్తించిన విక్రమ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో విక్రమ్ ఫ్లాట్‌లో వెళ్లి ఎలక్ట్రిక్ బెల్లు వైరింగ్ చూడాలని చెప్పి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications