Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్యను వదిలేసిన మోడీతో అయోధ్యలో ప్రాణప్రతిష్టా ? బీజేపీ నేత షాకింగ్ ప్రశ్న..!

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. జనవరి 22న ఆలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్టకు ముహుర్తం కూడా సిద్ధమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహణకు ఆలయ ట్రస్టు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. భార్యను వదిలేసిన ప్రధాని మోడీతో విగ్రహాల ప్రాణప్రతిష్ట ఎలా చేయిస్తారని ప్రశ్నించారు.

రామభక్తులు అయోధ్యలో రామ్ లాలా విగ్రహం ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొనడానికి మోడీని ఎలా అనుమతిస్తారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఇవాళ ఎక్స్ లో ప్రశ్నించారు. రాముడు దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు గడిపాడని, తన భార్య సీతను రక్షించడానికి యుద్ధం చేశాడని, మోడీ తన భార్యను వదిలేసిన భర్తగా పేరు తెచ్చుకున్నారని ఆక్షేపించారు. ఆయన ఇప్పుడు పూజ చేస్తాడా అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు.

how can pm modi, who abondoning wife do ayodhya temple pran-pratishta? bjp leader shocking question

మరోవైపు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆలయ ట్రస్టు బీజేపీ, ఆరెస్సెస్ సూచనలతో పలువురికి ఆహ్వానాలు పంపింది. వీరిలో బీజేపీకి బద్ధశత్రువులైన కమ్యూనిస్టులు, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. దీంతో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, ప్రధాని మోడీతో పాటు మంది పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ కార్యక్రమానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారు రావడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+