వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కూతురిని చంపి జైల్లో ఇంద్రాణి, మెంటల్, ఎలా నమ్ముతారు"

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో రెండేళ్లుగా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా మాటలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని తమిళనాడు నేతలు ప్రశ్నించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరాన్ని అరెస్టు చేయడాన్ని వారు ప్రశ్నంచారు.

ఇంద్రాణి గత రెండేళ్లుగా జైలులో ఉంటోందని, ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని, ఆె ఏవి చెప్తే అవి నమ్మి అరెస్టు చేస్తారా అని అంటూ దాదాపు 200 మంది కాంగ్రెసు పార్టీ నేతలు వల్లవార్ కొట్టాంలో ఆందోళనకు దిగారు.

ఇంద్రాణి మానసిక స్థితిపై సందేహాలు

ఇంద్రాణి మానసిక స్థితిపై సందేహాలు

ఇది బిజెపి కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని వారు అన్నారు. ఇంద్రాణి మాటలను కోర్టు స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆమె సరైన మానసిక స్థితిలో ఉండి చెప్పారో లేదో నిర్ధారించిన తర్వాతనే దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లు చేయడం సరి కాదని అన్నారు.

Recommended Video

INX Media Case : Indrani Mukerjea Brings Up P Chidambaram
 ఎలా పరిగణనలోకి తీసుకుంటారు

ఎలా పరిగణనలోకి తీసుకుంటారు

మీరు ఇంద్రాణి వాంగ్మూలాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని, ఆమె మానసిక పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందని, రెండేళ్లుగా ఆమె జైలులో ఉంటోందని, ఆమె వాంగ్మూలాన్ని కోర్ట్ ఆఫ్ లా ప్రకారం మరోసారి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

రాజకీయ కక్ష సాధింపు

రాజకీయ కక్ష సాధింపు

కార్తి చిదంబరంపై రాజకీయ కక్షలో భాగంగానే కేసు పెట్టారని తమిళనాడు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పీటర్ అల్ఫాన్స్ అన్నారు. క్విడ్ ప్రో కో కింద చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కార్తి పెద్ద మొత్తంలో లంచాలు తీుకుని ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలకు మేలు కలిగేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

వారి పేర్లు ఎందుకు లేవు

వారి పేర్లు ఎందుకు లేవు

ఐదుగురు ఐఎఎస్ అధికారులు ఎఫ్ఐపిబి డీల్‌కు సాయపడ్డారని, ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లు ఎందుకు లేవని, ఇంద్రాణి వాంగ్మూలం నిజమనిఎలా విశ్వసిస్తారని కరాటే త్యాగరాజన్ అన్నారు.

English summary
Congress leaders on Thursday questioned the “mental status” of former INX Media Ltd director Indrani Mukerjea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X