
15 ఏళ్ల క్రితం తన కుమార్తెను చంపి, ముక్కలుగా కోసిన హంతకుడిని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?

ఈ కథ 15ఏళ్ల క్రితం పాకిస్తాన్ పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లోని ''బోలె దీ ఝుగ్గీ’’ ప్రాంతంలో మొదలైంది. అప్పటికి తబస్సుమ్ వయసు 16ఏళ్లు. ఆమె తండ్రి తమ ఇంటికి సమీపంలోని మసీదులో ఇమామ్‌గా పనిచేసేవారు.
తబస్సుమ్‌కు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె తల్లిదండ్రులు మొహమ్మద్ సిద్దిఖ్‌ను హోమ్ ట్యూటర్‌గా నియమించారు.
తబస్సుమ్‌కు పాఠాలు చెప్పేందుకు రోజూ సిద్దిఖ్ ఇంటికి వచ్చేవారు. చదువుకునేటేప్పుడు తమ కుమార్తెను ఎవరూ ఇబ్బంది పెట్టేవారు కాదని, అందుకే ఆమె బాగా చదువుకోగలిగేదని ఆమె తల్లి హఫీజా బీబీ తెలిపారు.
''ఒక రోజు సాయంత్రం మా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. తబస్సుమ్ కూడా లేదు. దీంతో వెంటనే సమీపంలోని సిద్దిఖ్ ఇంటికి వెళ్లాం. అయితే, ఆయన ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగురుపొరుగు వారిని అడిగితే, ఆయన ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడని తెలిపారు’’అని హఫీజా బీబీసీకి వివరించారు.
మరోవైపు తమ ఇంట్లో తబస్సుమ్ వస్తువులు కూడా కనిపించలేదు. దీంతో తన టీచర్‌తో కలిసి తబస్సుమ్ వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు.
తబస్సుమ్ కోసం ఆమె తల్లి చాలా ప్రయత్నించింది. కానీ, ఆమెకు ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత తబస్సుమ్‌ను తాను పెళ్లి చేసుకున్నానని ఆమె కుటుంబానికి సిద్దిఖ్ ఫోన్‌లో చెప్పారు. తాము సంతోషంగా జీవిస్తున్నట్లు వెల్లడించారు.
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్, 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం నిజమేనా?

తబస్సుమ్ హత్య కేసు
- 15ఏళ్ల తబస్సుమ్‌కు పాఠాలు చెప్పేందుకు ఆమె ఇంటికి మహమ్మద్ సిద్దిఖ్ వచ్చారు.
- అయితే, 15ఏళ్ల క్రితం ఒకరోజు తబస్సుమ్, మహమ్మద్ సిద్దిఖ్ కనిపించకుండా పోయారు. ఆ తర్వాత తామిద్దరమూ పెళ్లి చేసుకున్నట్లు ఫోన్‌లో సిద్దిఖ్ వెల్లడించారు.
- పదేళ్ల తర్వాత లాహోర్‌లో తాము జీవిస్తున్నట్లు బంధువులకు సిద్దిఖ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు.
- అయితే, తబస్సుమ్ కోసం ఆమె తల్లి వెతికేవారు. అలా సిద్దిఖ్ పాఠాలుచేప్పే స్కూలుకు కూడా ఆమె వెళ్లారు.
- ఆ తర్వాత తబస్సుమ్ కోసం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- పోలీసుల విచారణలో తబస్సుమ్‌ను 15 ఏళ్ల క్రితమే చంపేసినట్లు సిద్దిఖ్ అంగీకరించాడు.
- ఆ హత్య బయటపడకుండా ఉండేందుకు.. శరీరాన్ని ముక్కలుగా కోసి భిన్న ప్రాంతాల్లో విసిరేసినట్లు సిద్దిఖ్ అంగీకరించాడు.
- మగ ఖైదీలపై పురుషులతోనే అత్యాచారం, అక్కడి జైళ్లలో నేరాలను ఇలానే ఒప్పిస్తారా?
- దిల్లీలో అమెరికన్ యువతి కిడ్నాప్ డ్రామా.. వీడియోకాల్‌కు వాడిన వైఫైను ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు

అసలు ఏం జరిగింది?
కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని వార్త తెలియడంతో ఆమె తండ్రి బాధలో కూరుకుపోయారని తబస్సుమ్ తల్లి హఫీజా బీబీ వెల్లడించారు. అయితే, బంధువులు, ఇరుగుపొరుగువారు తమను వెలివేస్తారనే భయంతో ఆయన కూతురితో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారని ఆమె తెలిపారు.
పరువు పోతుందనే భయంతో నా భర్త పోలీసు ఫిర్యాదు కూడా ఇవ్వలేదని హఫీజా చెప్పారు. అయితే, కొన్ని నెలల తర్వాత గుండె పోటుతో ఆయన మరణించారు.
ఆ తర్వాత దాదాపు పదేళ్లపాటు తబస్సుమ్‌ను కలిసేందుకు ఆమె తల్లి హఫీజా ప్రయత్నించారు. ''ఆమె గురించి తలచుకోకుండా ఒక్క రోజు కూడా గడిచేదికాదు’’అని ఆమె వివరించారు.
''ఆమె మొహం నా కళ్ల ముందు కనిపించేది. ప్రతి రోజూ ఆమె నాకు గుర్తువచ్చేది. కొన్నిసార్లు కలలో ఆమె కనిపించేది. ఒక్కోసారి అసలు ఆమెకు పాఠాలు చెప్పేందుకు సిద్దిఖ్‌ను ఎందుకు తీసుకొచ్చామా? అని మమ్మల్ని మేమే తిట్టుకునేవాళ్లం’’అని హఫీజా బీబీసీ చెప్పారు.
''తబస్సుమ్ గురించి ఆలోచనలు విపరీతంగా వచ్చేవి. ఒక్కోసారి ఆమె నాకు ఫోన్ చేస్తున్నట్లు అనిపించేది’’అని హఫీజా వివరించారు.
''ఒక్కోసారి బాధలో ఏడ్చేసేదాన్ని. ఎవరు ఏం అనుకుంటారోనని బయటకు కూడా చెప్పలేకపోదాన్ని’’అని ఆమె వివరించారు.
- హైదరాబాద్ స్కూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా?
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర

పదేళ్ల తర్వాత..
అయితే, పదేళ్ల తర్వాత తబస్సుమ్ అక్క పదేపదే కోరడంతో ఆమె భర్త సిద్దిఖ్‌కు ఫోన్ చేశారు. దీంతో లాహోర్‌లోని చౌహంగా ప్రాంతంలో తాము జీవిస్తున్నట్లు సిద్దిఖ్ వెల్లడించారు.
ఆ విషయం తబస్సుమ్ తల్లికి కూడా చెప్పారు. దీంతో తమ కుమార్తె సురక్షితంగానే ఉందని హఫీజా భావించారు. కానీ, తమ కుమార్తెతో మాట్లాడాలని పదేపదే హఫీజా అడుతున్నప్పటికీ, ఆమెకు ఆరోగ్యం బాగాలేదని సిద్దిఖ్ తప్పించుకుంటూ ఉండేవాడు.
అయినప్పటికీ వారు సిద్దిఖ్‌కు ఫోన్ చేస్తూ ఉండేవారు. దీంతో ఏకంగా ఫోన్‌ను సిద్దిఖ్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోయాయి.
- NCRB రిపోర్ట్: భారతదేశంలో పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఎందుకు?
- 'కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
మరింత ఆందోళన
ఈ పరిణామాల నడుమ హఫీజా బీబీలో ఆందోళన మరింత పెరిగింది. అసలు తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉందా? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీంతో అసలు అక్కడో ఏదో తప్పు జరిగిందని ఆమెకు అర్థమైంది.
తబస్సుమ్ కోసం జనవరి 2022లో లాహోర్‌లో చౌహంగ్ ప్రాంతానికి తన పెద్ద కుమార్తె, అల్లుడిని వెంట పెట్టుకుని హఫీజా వెళ్లారు. తను అదే ప్రాంతంలో ఉంటున్నానని సిద్దిఖ్ వారికి చెప్పాడు.
అయితే, అతడు సాందాలో ఉంటాడని, అక్కడే స్కూల్ పిల్లలకు పాఠాలు చెబుతుంటాడని, హోమియోపతి క్లినిక్‌ను కూడా నడిపిస్తుంటాడని స్థానికికుల వెల్లడించారు. దీంతో సిద్దిఖ్ కోసం ఆ ప్రాంతానికి హఫీజా వెళ్లారు. అయితే, అక్కడ ఆయన ఆచూకీ కనిపించలేదు.
సిద్దిఖ్ కనిపించకపోవడంతో తమలో అనుమానం మరింత ఎక్కువైందని హఫీజా వెల్లడించారు. ఎందుకంటే లాహోర్‌లో కూడా ఆయన గుర్తింపు గానీ, ఇల్లు గానీ ఏమీ దొకలేదు. అయితే, ఎలాగైనే అక్కడే ఉండి తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని హఫీజా నిర్ణయించుకున్నారు.
- ఇంటి మెట్ల కింద రహస్య అర, అందులో ఆరేళ్ల పాప.. రెండేళ్లుగా అందులోనే ఉంటున్న చిన్నారిని ఎలా కనిపెట్టారంటే..
- 'నన్ను రేప్ చేసి, నా భర్తను చంపేశారు’
దీని కోసం చౌబరజీ ప్రాంతంలోని ఇళ్లలో పనిచేసేందుకు హఫీజా సిద్ధమయ్యారు. ఉదయం పూట ఇళ్లలో బట్టలు ఉతుకుతూ, గిన్నెలు తోముతూ ఆమె పనిచేసేవారు. సాయంత్రం అవ్వగానే తమ కుమార్తె కోసం తిరిగేవారు. అలానే నాలుగు నెలలు గడిచాయి.
అలా తన కుమార్తె కోసం వెతుకుతూ చాబరజీ ప్రాంతంలోని స్కూలుకు ఆమె వెళ్లారు. అక్కడే పిల్లలకు సిద్దిఖ్ పాఠాలు చెప్పేవాడు.
ఒక రోజు సిద్దిఖ్ కనిపించిన వెంటనే తమ కుమార్తె ఎక్కడుందని హఫీజా అడిగారు. అయితే, మాటల మధ్యలోనే సిద్దిఖ్ అక్కడి నుంచి పరారయ్యాడని ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లో పేర్కొన్నారు.
అలా ఒక్కసారిగా అక్కడి నుంచి సిద్దిఖ్ పరారు కావడంతో తన కాలి కింద నేల తిరిగినట్లు అనిపించిందని హఫీజా వెల్లడించారు. అప్పుడే తన కుమార్తెకు ఏదో జరగరానిది జరిగిందని ఆమెకు అర్థమైంది. వెంటనే చౌబరజీలోని సాందా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేశారు. అక్కడున్న ఎస్‌హెచ్‌వో ఆదిల్ సయీద్‌ను సాయం చేయాలని ఆమె కోరారు.
సిద్దిఖ్ ఫోటోలను కూడా పోలీసులకు ఆమె ఇచ్చారు. దీంతో వెంటనే సిద్దిఖ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. వారి ప్రయత్నాలు కూడా ఫలించాయి.
- ఆన్లైన్ పోర్న్: 'విద్యార్థులు పోర్న్ హింస గురించి నన్ను అడుగుతున్నారు’
- ఆమెకు ఎయిడ్స్ ఉంది.. బావ కొడుకైన టీనేజ్ కుర్రాడితో 'బలవంతంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది’.. ఆ తర్వాత ఏమైందంటే..
అది హత్య..
మొదట్లో సిద్దిఖ్ చాలా కథలు చెప్పేవాడని ఎస్‌హెచ్‌వో సయీద్ వివరించారు. అయితే, విచారణలోనే 15ఏళ్ల క్రితమే తబస్సుమ్‌ను తాను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు.
''2007లో తబస్సుమ్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు సిద్దిఖ్ చెప్పాడు. దీనికి ముందుగా మొదటి భార్యకు అతడు విడాకులు ఇచ్చాడు. ఆమెతో అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు’’అని సయీద్ తెలిపారు.
''తబస్సుమ్‌ను లాహోర్‌కు సిద్దిఖ్ తీసుకొచ్చాడు. అయితే, అప్పుడు ఆయన వెంట పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు ఆయన పిల్లలే. వారి వల్ల తబస్సుమ్‌తో రోజూ గొడవలు అయ్యేవని అతడు చెప్పాడు. పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించాలని రోజూ తబస్సుమ్ గొడవ పడేదని వివరించాడు’’అని సయీద్ వివరించారు.
''పెళ్లి అయిన ఐదు నెలల తర్వాత తబస్సుమ్, సిద్దిఖ్‌ల మధ్య ఒక రోజు రాత్రి పెద్ద గొడవ జరిగింది. సహనం కోల్పోయిన సిద్దిఖ్.. తబస్సుమ్‌ను పైకెత్తి మంచానికి వేసి కొట్టారు. ఆమె నోరును మూసేందుకు గొంతును కూడా నొక్కడం మొదలుపెట్టారు. కొంత సేపటికి తబస్సుమ్ నుంచి మాట రాలేదు. అంటే అప్పటికే ఆమె చనిపోయింది’’అని సయీద్ చెప్పారు.
ఈ హత్యను పైకి కనిపించకుండా చూసేందుకు తబస్సుమ్ శరీరాన్ని ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసినట్లు విచారణలో సిద్దిఖ్ అంగీకరించాడు.
2007లో బక్రీద్ మూడో రోజు తబస్సుమ్‌ను సిద్దిఖ్ హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జంతువుల కళేబరాల మధ్య ముక్కలుగా కోసిన తన భార్య శవాన్ని పడేశాడు. ఆ తర్వాత సిద్దిఖ్ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు.
ఈ కేసులో సిద్దిఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అనంతరం, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సిద్దిఖ్ తరఫున ఏ న్యాయవాదీ వాదించలేదు. మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా పెట్టుకోలేదు.
నిజానికి ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంటనే తబస్సుమ్ కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చుంటే.. బహుశా ఆమె ఇప్పటికీ బతికే ఉండొచ్చని హఫీజా ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?