మస్ట్ రీడ్ : వాజ్‌పేయి జీవితానికి కేరళ వరదలకు సంబంధం ఏమిటి..?

Recommended Video

    కేరళలో వరదలు ఎందుకు వచ్చాయి

    అటల్ బిహారీ వాజ్‌పేయి కారణ జన్ముడు. ఆయన ఓ కర్మయోగి. వాజ్ పేయికి ప్రక‌ృతి అంటే చాలా ఇష్టం. అది ఆయన జీవితంతో మమేకమైంది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించిన నాటికి... మరణించిన నాటికి కేరళ రాష్ట్రానికి సంబంధం ఉందని చెప్పుకోవాలి. గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయికి కేరళ రాష్ట్రానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఉత్తర భారతంలోనే వాజ్‌పేయి తన జీవితమంతా గడిపారు.. మరి దక్షిణ రాష్ట్రం అయిన కేరళతో ఆయనకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నాం...

    అటల్ బిహారి వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జన్మించారు. వాజ్‌పేయి పుట్టిన సమయానికి కేరళలో అప్పటి వరకు ఎప్పుడూ లేని వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ వరదల ధాటికి చాలామంది చనిపోయారు. కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు. మూడువారాల పాటు కేరళలో కురిసిన భారీ వర్షాలకు పెరియార్ నది ఉగ్రరూపం దాల్చింది. ఆ నదిలో వరదలు పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. కేరళలోని చాలా జిల్లాలు నీటమునిగాయి. అందులో త్రిచూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం లాంటి ప్రాంతాల్లో ఎటు చూసిన వరదనీరే కనిపించేది. అసలు ఇక్కడ ఆ ఊళ్లు ఉన్నాయా అనే అనుమానం వచ్చేది. ఆ వరదల ధాటికి కరింతిరి మలై అనే కొండ కూడా కొట్టుకుపోయిందంటే ఎంతలా వరదలు వచ్చిఉంటాయో ఊహించొచ్చు. ఇక మున్నార్ ప్రాంతంలో రోడ్డు కనిపించకుండా పోయింది.

    How is Vajpayees life related with Kerala floods..watch out

    వరదలు ఆనాడు కేరళను ముంచెత్తిన సమయానికి మళయాళీ క్యాలెండర్ ప్రకారం అది 1099 సంవత్సరం. ఆ నాడు వరదలు సృష్టించిన బీభత్సానికి మళయాళీలు దాన్ని 'గ్రేట్ ఫ్లడ్ 99'అని పిలిచారు. అదే రోజు అంటే 1924 డిసెంబర్ 25న కారణజన్ముడు అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించారు. మళ్లీ ఇంత కాలానికి ఈ స్థాయిలో వరదలు కేరళలో వచ్చాయి. సుమారు 100 మంది ప్రాణాలను కబళించాయి అక్కడి వరదలు. ఈ వరదలను చూసి మళయాళీలు మళ్లీ గ్రేట్ ఫ్లడ్ 99 వచ్చిందని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో కర్మయోగి వాజ్‌పేయి కూడా మృతి చెందారు. నాటి కేరళ వరదల సమయంలో వాజ్‌పేయి జన్మించారు... నేటి కేరళ వరదల సమయంలో ఆ మహానేత వాజ్‌పేయి కన్నుమూశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+