వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హృతిక్: మోడీ దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

ఇస్తాంబుల్/ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ పెను ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. హృతిక్ తన పిల్లలు హృహాన్‌, హృదాన్‌లతో కలిసి విహారయాత్రకు స్పెయిన్‌, ఆఫ్రికా వెళ్లారు. యాత్ర ముగించుకుని ఇస్తాంబుల్‌ నుంచి ముంబై చేరుకోవాల్సి ఉంది.

ఈ క్రమంలో హృతిక్‌కు ఇస్తాంబుల్‌ నుంచి కనెక్టింగ్‌ విమానం మిస్‌ అయింది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ అధికారులు హృతిక్‌కు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం మరుసటి రోజు ఉండడంతో ఎకానమీ క్లాస్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుని వెంటనే ముంబై బయలుదేరిపోయాడు హృతిక్.

ఎయిర్‌పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)ఎయిర్‌పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)

ఈ విషయాన్ని హృతిక్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. 'ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులు మరోసారి అమాయకుల్ని బలితీసుకున్నారు. అందరం ఒకటిగా నిలిచి ఉగ్రవాదాన్ని అరికట్టాలి.' అంటూ హృతిక్‌ ట్వీట్‌ ద్వారా పిలుపునిచ్చారు.

Hrithik Roshan: Was helped by the kindest staff at Istanbul airport

కాగా, హృతిక్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన గంటల వ్యవధిలోనే ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించి 36మందిని బలితీసుకున్నారు. ఈ దాడిలో 150మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఉగ్రదాడిని ఖండించిన మోడీ

ఇస్తాంబుల్ ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్‌ దాడి అమానుషమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఇస్తాంబుల్‌ దాడిని ఖండించారు.

English summary
Bollywood actor Hrithik Roshan and his sons Hrehaan and Hridhaan were at Istanbul airport hours before the suicide bomb attack that has killed 36 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X